ఎఫ్‌1 చైర్మన్‌గా ఎకెల్‌స్టోన్‌ అవుట్‌ | Sakshi
Sakshi News home page

ఎఫ్‌1 చైర్మన్‌గా ఎకెల్‌స్టోన్‌ అవుట్‌

Published Tue, Jan 24 2017 11:59 PM

ఎఫ్‌1 చైర్మన్‌గా ఎకెల్‌స్టోన్‌ అవుట్‌ - Sakshi

లాస్‌ ఏంజిల్స్‌: దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఫార్ములావన్‌ (ఎఫ్‌1)ను తన గుప్పిట్లో ఉంచుకున్న 86 ఏళ్ల బెర్నీ ఎకెల్‌స్టోన్‌ శకం ఇక ముగిసినట్టే. కొలరాడోకు చెందిన లిబర్టీ మీడియా 8 బిలియన్‌ డాలర్లకు ఎఫ్‌1ను టేకోవర్‌ చేసింది.

దీంతో చైర్మన్‌గా ఎకెల్‌స్టోన్‌ స్థానంలో చేస్‌ క్యారీ నియమితులయ్యారు. అలాగే ఎఫ్‌1 చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా కూడా ఆయనే వ్యవహరిస్తారు. ఎకెల్‌స్టోన్‌ సలహాదారుడి పాత్రకు పరిమితమవుతారని లిబర్టీ మీడియా పేర్కొంది.
 

Advertisement
Advertisement