క్రికెట్‌ ఆస్ట్రేలియాపై సచిన్‌ అభిమానుల ఫైర్‌

24 Apr, 2018 15:09 IST|Sakshi
ఫ్లెమింగ్‌, సచిన్‌ (ఫైల్‌ ఫొటో)

ఎన్ని నిషేదాలు విధించిన సీఏ బుద్ది మారదు

హైదరాబాద్‌ : క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) చేసిన ఓ ట్వీట్‌ దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. క్రికెట్‌ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న సచిన్‌ నేడు 45వ పుట్టిన రోజును జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ డామియన్ ఫ్లెమింగ్ పుట్టిన రోజు కూడా ఇదే రోజు. ఈ నేపథ్యంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఫ్లెమింగ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. తమ అధికారిక వెబ్‌సైట్‌ క్రికెట్‌.కామ్‌.ఏయూ ట్విటర్‌ పేజీలో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. అయితే ఈ వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సచిన్‌ అభిమానుల సోషల్‌ మీడియా వేదికగా సీఏపై మండిపడుతున్నారు.

అందులో​ ఏముందంటే.. ఫ్లేమింగ్‌ బౌలింగ్‌లో సచిన్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయిన వీడియో.. ఇదే అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. తమ అభిమాన క్రికెటర్‌ను తక్కువ చేసేలా ఆ వీడియో ఉందని భావించిన అభిమానులు.. ఆస్ట్రేలియా బౌలర్లను సచిన్‌ చీల్చిచెండాడిన వీడియోలను పోస్ట్‌ చేస్తూ క్రికెట్‌ ఆస్ట్రేలియాకు బదులిస్తున్నారు. ఇంకొందరైతే.. ‘ఎన్ని నిషేదాలు విధించినా మీరు మారారు.. సచిన్‌ బర్త్‌డే అని తెలిసి కూడా ఫ్లెమింగ్‌ బౌలింగ్‌ చేసిన వీడియోను ఎలా పోస్ట్‌ చేస్తారు.? మీకు వేరే బ్యాట్స్‌మన్‌ దొరకలేదా’ అని ఘాటుగా కామెంట్‌ చేస్తున్నారు.

ఫ్లెమింగ్‌ బౌలింగ్‌లో సచిన్‌ వన్డే, టెస్టుల్లో కలిపి మొత్తం ఏడు సార్లు ఔటయ్యాడు. సచిన్‌ సైతం చాలా సందర్భాల్లో ఫ్లెమింగ్‌ బౌలింగ్‌ను ఉతికారేశాడు. ఇక 1998 షార్జా కోకకోలా కప్‌లో సెంచరీ సాధించి సింగిల్‌ హ్యాండ్‌తో భారత్‌ను గెలిపించాడు.

క్రికెట్‌ ఆస్ట్రేలియా చేసిన ట్వీట్‌..

అభిమానులు చేసిన ట్వీట్‌లు

మరిన్ని వార్తలు