అదరహో అశ్విన్...

13 Oct, 2016 00:40 IST|Sakshi
అదరహో అశ్విన్...

నిలకడైన ప్రదర్శనకు మారుపేరుగా మారిన ఆఫ్ స్పిన్నర్
భారత విజయాల్లో కీలకపాత్ర


ఒక రికార్డుతో ఇమ్రాన్‌ఖాన్‌లాంటి దిగ్గజాన్ని దాటేశాడు. మరో రికార్డుతో మాల్కం మార్షల్‌లాంటి మరో లెజెండ్‌ను మరిపించాడు. కుంబ్లేకు, హర్భజన్‌కు కూడా సాధ్యం కాని అనేక గణాంకాలు అలవోకగా వచ్చి చేరుతున్నారుు. అతనిని వదిలి పెట్టలేమన్నట్లుగా అంకెలు అతనితో అనుబంధాన్ని పెనవేసుకుంటున్నారుు! భారత్‌లో భారత్ టెస్టు సిరీస్ గెలవడం, స్పిన్నర్లు గెలిపించడం మొదటిసారి కాదు, ఆ విజయాలు మనకు కొత్త కాదు. కానీ ఇలా చేతి నుంచి బంతి దాటడమే ఆలస్యం... అలా వికెట్లు అతని ఒళ్లో వాలిపోతున్నారుు. రవిచంద్రన్ అశ్విన్ చేస్తున్న మాయాజాలానికి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పాహిమాం అంటున్నారు.

 
సూర్యుడు తూర్పున ఉదరుుంచడంలాంటిదే ఇన్నింగ్‌‌సలో అశ్విన్ ఐదు వికెట్లు తీయడం అంటూ అతనిపై అభినందనలు కురుస్తుంటే... అతిశయోక్తిగా అనిపించినా చావుపుట్టుకలు ఎంత సహజమో అశ్విన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కావడం అంతే సహజమంటూ మరో మాజీ క్రికెటర్ తనదైన భావాన్ని ప్రదర్శించాడు. ఐదేళ్ల స్వల్ప కెరీర్‌లోనే ఎవరికీ అందనంత ఎత్తులో అతని రికార్డులు నిలుస్తుండగా, ఇదే తరహాలో జోరు కొనసాగితే వేరుు వికెట్ల మైలురారుు కూడా చిన్నదిగా మారిపోతుందేమో! ఇప్పటికే వరుసగా నాలుగు జట్లు ఈ చెన్నై స్టార్ దెబ్బ రుచి చూశారుు. ఇక ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలకు ప్రమాద హెచ్చరిక జారీ అరుునట్లే! 

 

సాక్షి క్రీడా విభాగం
దాదాపు మూడేళ్ల క్రితం జొహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో అశ్విన్ 42 ఓవర్లు పాటు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఆ దెబ్బకు భారత్ ఆడిన తర్వాతి ఏడు టెస్టుల్లో అతనికి చోటు లభించలేదు. అరుుతే ఈ వైఫల్యం నుంచి అతను పాఠాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత తన యాక్షన్‌లో స్వల్ప మార్పులు చేసుకున్నాడు. క్యారమ్ బాల్‌పై అమితంగా ఆధారపడకుండా రెగ్యులర్ ఆర్మ్ బాల్‌పైనే ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. ఆ తర్వాత జట్టులోకి తిరిగొచ్చిన తర్వాత అశ్విన్‌కు ఎదురు లేకుండా పోరుుంది. అశ్విన్ ఇంజినీరింగ్ బుర్ర కూడా అద్భుతాలు సృష్టించడంలో బాగా పని చేసింది. అప్పటి వరకు హర్భజన్ తర్వాత మాత్రమే ప్రత్యామ్నాయ స్పిన్నర్‌గా అవకాశాలు దక్కించుకుంటూ వచ్చిన అశ్విన్, ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లిపోయాడు. వికెట్లలో, రికార్డులలో భజ్జీని వెనక్కి తోస్తూ ఆల్‌టైమ్ బెస్ట్ స్పిన్నర్లలో ఒకడిగా నిలిచేందుకు కావాల్సిన అర్హతను అందుకున్నాడు.

 
వేదిక ఏదైనా..
.
‘ప్రస్తుతం స్పిన్నర్ల కోసమే తయారు చేస్తున్న పిచ్‌లను మేం ఆడినప్పుడు రూపొందిస్తే నా వికెట్లు, కుంబ్లే వికెట్ల సంఖ్య ఎక్కడో ఉండేది’ హర్భజన్ సింగ్ చేసిన తాజా వ్యాఖ్య ఇది. విశ్లేషణకంటే ఒక రకమైన అసూయ, ఒక ఆఫ్ స్పిన్నర్‌గా తనను అశ్విన్ దాటేసి వెళుతున్నాడనే బాధ ఈ మాటల్లో ఎక్కువగా కనిపిస్తోంది. కొన్నాళ్ల క్రితం వరకు కూడా ఇందులో వాస్తవం ఉంది. అశ్విన్ అద్భుత బౌలింగ్ అంటూ బ్రాకెట్లో పిచ్ షరతులు వర్తిస్తారుు అంటూ జోక్ చేసిన రోజులు కూడా ఉన్నారుు. కానీ ఇప్పుడు అది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే చివరి టెస్టు జరిగిన ఇండోర్ వికెట్ స్పిన్‌కు పెద్దగా అనుకూలించలేదు. అనూహ్యంగా టర్న్‌లాంటివి దొరకలేదు. అరుునా సరే అశ్విన్ తనదైన శైలిలో చెలరేగిపోయాడు. గత దక్షిణాఫ్రికా సిరీస్ సమయంలో పిచ్‌లపై విమర్శలు వచ్చిన విషయం వాస్తవమే అరుునా... న్యూజిలాండ్ వైపు నుంచి కూడా పిచ్‌ల గురించి ఎలాంటి ఫిర్యాదు లేదు. పైగా అశ్విన్ తీసిన వికెట్లు చూస్తే పిచ్ అనుకూలతకంటే అతని తెలివితేటలే ఎక్కువగా కనిపిస్తారుు. కోహ్లి చెప్పినట్లు ‘పిచ్ ఒక్కటే వికెట్లు అందించదు, బౌలర్‌లో కూడా సత్తా ఉండాలి. బంతిని భుజం నుంచి వదిలేటప్పుడే మనం ఏం చేయాలనేది బుర్రలో ఉండాలి. అప్పుడే పిచ్‌పై పడిన తర్వాత బంతి స్పందిస్తుంది’. ఈ రకంగా చూస్తే అశ్విన్ పక్కా ప్లానింగ్ అతని ప్రదర్శనలో కీలకమని అర్థమవుతుంది. ఇటీవల నాటి పేస్ వికెట్లు  లేకపోరుునా... సంప్రదాయంగా స్పిన్‌కు అంతగా అనుకూలించని వెస్టిండీస్‌లో కూడా అశ్విన్ తాజా సిరీస్‌లో 17 వికెట్లు తీయగలిగాడు. అంటే అతని ఆట ఎంతో మెరుగైందనే విషయం మాత్రం వాస్తవం.


కుదేలైన కివీస్...
రెండు సార్లు మ్యాచ్‌లో పది వికెట్లు, మూడు సార్లు ఇన్నింగ్‌‌సలో ఐదు వికెట్లు, కేవలం 17.77 సగటుతో 27 వికెట్లు... తాజాగా న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అశ్విన్ అద్భుత గణాంకాలివి. కేవలం మూడు టెస్టుల్లో 27 వికెట్లతో అతను సత్తా చాటాడు. సుదీర్ఘ స్పెల్‌ల పాటు బౌలింగ్ చేయడం, కెప్టెన్ కోహ్లి ఆశించిన సమయంలో, కీలకమైన క్షణంలో వికెట్ తీసి మ్యాచ్‌ను మళ్లీ మన చేతుల్లోకి తీసుకు రావడం రొటీన్‌గా సాగిపోరుుంది. కాస్తరుునా మెరుగైన ప్రదర్శన ఇద్దామని భారత్‌లో అడుగు పెట్టిన న్యూజిలాండ్‌ను అశ్విన్ దారుణంగా దెబ్బ తీశాడు. మూడు టెస్టుల్లో కొన్ని సందర్భాల్లో కివీస్‌కు ఆధిపత్యం ప్రదర్శించే మంచి అవకాశాలు లభించినా అశ్విన్ వల్లే మన జట్టు కోలుకోగలిగింది. ఇండోర్ టెస్టు తొలి ఇన్నింగ్‌‌సలో అతని బౌలింగ్ జోరు చూస్తే పది వికెట్లు అతనికే దక్కుతాయేమోనని అనిపించింది. దిగ్గజ క్రికెటర్ సంగక్కర సొంతగడ్డపై వరుసగా నాలుగు సార్లు అశ్విన్‌కే అవుటైతే, ప్రస్తుతం ప్రపంచ టాప్ బ్యాట్స్‌మెన్‌లో ఒకడైన విలియమ్సన్ కూడా నాలుగు సార్లు తన వికెట్ అశ్విన్‌కే అప్పగించాడు. ఈ రెండింటికి మధ్య మరో టెస్టు స్టార్ హషీం ఆమ్లా కూడా అతని దెబ్బకే తలవంచాడు. 2013లో 0-4తో చిత్తుగా ఓడిన ఆసీస్, ఇప్పటికే అశ్విన్ బౌలింగ్ రుచి చూసింది. అంతకుముందు ఏడాది అశ్విన్‌ను సమర్థంగా ఎదుర్కోవడం వల్లే ఇంగ్లండ్ మన గడ్డపై సిరీస్ గెలవగలిగింది. ఇప్పుడు ఈ రెండు టీమ్‌లు మళ్లీ మన వద్దకు వస్తున్నారుు. ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. సొంతగడ్డపై మరో 10 టెస్టులు వరుసగా ఆడనుండటంతో అశ్విన్ రికార్డుల బాక్స్‌లు బద్దలు చేయడం మాత్రం ఖాయం.

 

 ఘనతల గని...
7  అశ్విన్ కెరీర్‌లో (39 టెస్టులు) ఇది ఏడో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు. అతనికంటే ముందు ఇన్ని సిరీస్ అవార్డులు అందుకోవడానికి ఇమ్రాన్‌ఖాన్‌కు 70 టెస్టులు పట్టారుు. అశ్విన్ అరంగేట్రం తర్వాత భారత్ 8 టెస్టు సిరీస్‌లు గెలిస్తే 7సార్లు అశ్విన్ బెస్ట్ ప్లేయర్‌గా నిలవడం విశేషం.

4 వరుసగా అశ్విన్ నాలుగు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్నాడు. గతంలో ఇమ్రాన్, మార్షల్‌లు మాత్రం ఇలా అందుకున్నారు.

 6  కుంబ్లే (8) తర్వాత అశ్వినే అత్యధికంగా ఆరు పర్యాయాలు మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టాడు.

 

 1 అశ్విన్ 39 టెస్టులోనే 220 వికెట్లను పడగొట్టాడు. ఇన్ని టెస్టుల తర్వాత ఎవరికీ ఇది సాధ్యం కాలేదు.

 

1 అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన తర్వాత అన్ని ఫార్మాట్‌లలో కలిపి 413 వికెట్లు తీశాడు. మరే ఇతర బౌలర్ ఇన్ని వికెట్లు తీయలేదు.

 

మరిన్ని వార్తలు