సెమీఫైనల్లో సంస్కృతి

7 May, 2014 00:34 IST|Sakshi

ఐటా టాలెంట్ సిరీస్ టెన్నిస్ టోర్నీ
 సాక్షి, హైదరాబాద్:  ఐటా అండర్-14 టాలెంట్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో దామెర సంస్కృతి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. నేరెడ్‌మెట్ క్రాస్ రోడ్స్‌లోని రమా టెన్నిస్ అకాడమీలో మంగళవారం బాల, బాలికల సింగిల్స్ విభాగాల్లో క్వార్టర్ ఫైనల్ పోటీలు జరిగాయి. బాలికల సింగిల్స్‌లో సంస్కృతి 4-1, 4-2తో సొనాలి జైస్వాల్‌పై అలవోక విజయం సాధించింది.
 
  ఇతర సింగిల్స్ మ్యాచ్‌ల్లో సృష్టి 1-4, 4-0 (10/7)తో ఇషికా అగర్వాల్‌పై, తులసీ కార్వార్ 4-1, 4-2తో అనన్య మోహన్‌పై, సాహితి రెడ్డి 4-1, 5-3తో షరాన్ శామ్సన్‌పై విజయం సాధించారు. బాలుర సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అమన్ ఖాన్ 4-0, 5-3తో రిషిల్ గుప్తాపై, సుహిత్ రెడ్డి 4-1, 5-4 (11/9)తో వల్లభనేని ప్రీతమ్‌పై, శివ అనిరుధ్ 4-1, 4-1తో దీపక్ వాయరపై, సిఖ్ సంచిత్ 4-2, 4-5 (10/6)తో హర్షిత్ కొసరాజుపై గెలుపొందారు.
 

మరిన్ని వార్తలు