మళ్లీ వార్తల్లో శుభ్‌మన్‌, సారా టెండూల్కర్

13 May, 2020 15:10 IST|Sakshi

కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు లాక్‌డౌన్‌ సుత్రాన్ని పాటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సామాన్యులే కాకుండా చాలా మంది సెలబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో క్రీడాకారులు కూడా మైదానాలకు దూరంగా.. ఇళ్లలోనే ఉండిపోయారు. ఈ క్వారంటైన్‌ టైమ్‌లో చాలా మంది క్రీడాకారులు తమలో దాగి ఉన్న కొత్త కళలను బయటికి తీసుకువస్తున్నారు. తాజాగా క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ కూడా తనలోని ఫొటో ఎడిటింగ్‌ స్కిల్స్‌ను చూపెట్టాడు.

ఓ ఫొటోలో బ్యాగ్రౌండ్‌ ఒకే విధంగా కనబడేలా.. ఓవైపు వర్క్‌ అవుట్స్‌ చేస్తున్నట్టు, మరోవైపు విశ్రాంతి తీసుకున్నట్టు ఎడిటింగ్‌ చేశారు. ఈ ఫొటోను శుభ్‌మన్‌ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో పలువురు నెటిజన్లు శుభ్‌మన్‌ ఎడిటింగ్‌ స్కిల్స్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమార్తె సారా మాత్రం విభిన్నంగా స్పందించారు. ఆ ఎడిటింగ్‌ అతనే చేశారని భావిస్తున్నారా? అంటూ కామెంట్‌ చేశారు. దీంతో శుభ్‌మన్‌, సారా మధ్య ఏదో ఉందనే వార్తలు మరోసారి ప్రచారంలోకి వచ్చాయి.  సారానే ఈ ఎడిటింగ్‌ చేసి ఉంటారని కొందరు, వీరిద్దరు డేటింగ్‌లో మరికొందరు కామెంట్‌లు చేస్తున్నారు.(చదవండి : ‘భారత్ వద్దనుకుంటే టెస్ట్ క్రికెట్ అంతం’)

గతేడాది శుభ్‌మన్‌ కొత్త కారు కొన్న సందర్భంగా ఓ ఫొటో పోస్ట్‌ చేయగా.. సారా అతనికి కంగ్రాట్స్‌ చెప్పారు. దీనిపై స్పందించిన టీమిండియా క్రికెటర్‌ హార్దిక్‌‌ పాండ్యా.. శుభ్‌మన్‌ను ఆటపట్టించేలా ఓ ఫన్నీ కామెంట్‌ చేశారు. దీంతో అప్పటి నుంచే సారా, శుభ్‌మన్‌ల మధ్య ఏదో ఉందనే వార్తలకు ప్రచారం కల్పించినట్టయింది.

One is focused while the other is chilling. Which one are you this week😉

A post shared by Ꮪhubman Gill (@shubmangill) on

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా