ప్రమాదంలో షకిబుల్‌ కెరీర్‌

26 Oct, 2019 15:12 IST|Sakshi

మిర్పూర్‌:  ఇటీవల తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ సమ్మెకు దిగిన బంగ్లాదేశ్‌ క్రికెటర్లకు నేతృత్వం వహించిన ఆల్‌ రౌండర్‌ షకిబుల్‌ టార్గెట్‌ చేసింది ఆ దేశ క్రికెట్‌ బోర్డు. ఒక స్థానిక టెలికాం కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా షకిబుల్‌ వ్యవహరించడంతో అతనిపై చట్టపరమైన తీసుకోవడానికి బీసీబీ సిద్ధమైంది. బీసీబీ ఆటగాళ్ల ఒప్పందం ప్రకారం కాంట్రాక్ట్‌ కల్గిన ఒక జాతీయ స్థాయి క్రికెటర్‌ ఏ టెలికాం కంపెనీతోనూ జట్టు కట్టకూడదు. అయితే దీన్ని షకిబుల్‌ అతిక్రమించడంతో అతనిపై చర్యలు తీసుకునేందుకు ఆగమేఘాల మీద ప్రణాళిక రూపొందిస్తోంది. కనీసం ఎటువంటి వార్నింగ్‌ ఇవ్వకుండానే అతన్ని ఇరకాటంలో పెట్టేందుకు చూస్తోంది. దాంతో షకిబుల్‌ హసన్‌ కెరీర్‌ ప్రమాదంలో పడింది.

అక్టోబర్‌22వ తేదీన గ్రామీఫోన్‌ టెలికాం సంస్థకు షకిబుల్‌ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. ఇది బీసీబీకి ఆగ్రహం తెప్పించింది. అదే సమయంలో ఆటగాళ్లను వెంటబెట్టుకుని మరీ సమ్మెకు దిగడం కూడా బీసీబీ జీర్ణించుకోలేకపోతుంది. దాంతో షకిబుల్‌ను జట్టు నుంచి సాగనంపడానికి బీసీబీకి ఒక వివాదం దొరికింది. ‘ షకీబుల్‌పై లీగల్‌ యాక్షన్‌ తీసుకోబోతున్నాం. మా నియమ నిబంధనల్ని ఉల్లంఘించిన ఏ ఒక్క క్రికెటర్‌ను ఉపేక్షించేది లేదు. మాకు షకీబుల్‌ పరిహారం చెల్లించుకోవాల్సింది. కంపెనీతో పాటు సదరు ఆటగాడు కూడా మాకు నష్ట పరిహారం ఇవ్వాల్సిందే. దీనిపై ఇప్పటికే కంపెనీ నుంచి పరిహారం కోరుతూ లీగల్‌ నోటీసు పంపాం. షకీబుల్‌ దీనిపై వివరణ ఇవ్వాలని కోరతాం.. దాంతో పాటు పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే కఠినమైన చర‍్యలు తీసుకుంటాం’ బీసీబీ చీఫ్‌ నజ్ముల్‌ హసన్‌ పేర్కొన్నారు.(ఇక్కడ చదవండి: ఏయ్‌ వేషాలు వేస్తున్నావా.. క్రికెటర్‌కు వార్నింగ్‌!)

మరిన్ని వార్తలు