షేన్‌వార్న్‌ మరో ‘సెక్స్‌’బాగోతం

31 Aug, 2019 17:27 IST|Sakshi

లండన్‌ : ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ స్పిన్‌ బౌలర్‌ షేన్‌వార్న్‌ శృంగార పురుషుడనే ప్రపంచానికి తెల్సిందే. ఈ విషయంలో ఆయన ఎప్పుడు వార్తల్లో వ్యక్తిగా ఉంటూ వస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆయన తన అజ్ఞాత (బయటి ప్రపంచానికి ఇంకా ఆమె పేరు తెలియదు) ప్రేయసి ఒకరు 19 ఏళ్ల డవీనా, 27 ఏళ్ల పాప్పిలనే ఇద్దరు సెక్స్‌ వర్కర్లను నేరుగా ఇంటికి తీసుకరాగా నలుగురు కలిసి సరస సల్లాపాల్లో మునిగి తేలారట. పైగా షేన్‌ వార్న్‌ తన పడక గది కిటికీ తలుపులు తెరచి ఉంచడంతో ఇరుగు పొరుగు వారి దృశ్యాలను చూసినంత సేపు చూసి చివరకు ఓ స్థానిక టీవీ ఛానల్‌కు ఫిర్యాదు చేశారట. టీవీ బృందం పరుగెత్తుకొచ్చే సరిగా ఇద్దరు సెక్స్‌ వర్కర్లను తీసుకొని ఆ అజ్ఞాత ప్రేయసితో తన కారులో ఉడాయించారట.

ఈ బాగోతమంతా లండన్‌ వాయువ్య ప్రాంతంలోని షేన్‌వార్న్‌కు చెందిన 30 కోట్ల రూపాయల విలువైన ‘మైడా వాలే’ నివాసంలో జరిగిందట. ఈ వార్తా కథనాన్ని ప్రచురించిన ‘ది సన్‌’ పత్రిక డవీనా రెండు గంటలకు 40 వేలు, పొప్పి ప్రతి రెండు గంటలకు 50 వేల రూపాయలు చార్జి చేస్తారని తెలిపింది. డవీనాకు మార్కెట్లో ‘పాకెట్‌ రాకెట్‌’ అని పాప్పిని ‘పార్టీ గర్ల్‌’ అని పిలుస్తారట. షేన్‌వార్న్‌ తన జీవితంలో ఇప్పటికే పలువురు అమ్మాయిలను ప్రేమించారు. వారిలో ఒకరిద్దరిని పెళ్లి చేసుకొని వదిలేశారు. మిగతా వారిని పెళ్లి చేసుకోకుండానే వదిలేశారు. స్త్రీ లోలుడన్న కారణంగానే ఆయన కొన్నిసార్లు ఆస్ట్రేలియా క్రికెట్‌ మ్యాచ్‌ల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

షేన్‌ వార్న్‌ వ్యక్తిగత జీవితంలోని విచ్చలవిడితనం వల్ల కాకుండా, తెల్లార్లు శృంగార లీలల్లో పాల్గొంటూ నిద్ర మత్తుతో క్రికెట్‌ మైదానంలోకి అడుగు పెట్టడమే అందుకు ప్రధాన కారణమని తోటి క్రికెటర్లు చెబుతారు. ఆయన కూడా తన శృంగార లీలల గురించి ఎప్పుడూ దాచుకోలేదు. ‘నేనేమి నేరం చేయడం లేదు. ఎవరికేమీ అన్యాయం చేయడం లేదు. నాకు అందమైన అమ్మాయిలతో శృంగారమంటే మహా పిచ్చి. అమ్మాయిల అనుమతితోనే నేను వారితో గడుపుతాను’ అని షేన్‌ పలు సందర్భాల్లో తన గురించి తాను చెప్పుకున్నారు. ‘లవ్‌ ఐలాండ్‌’ పోటీల్లో పొల్గొన్న 21 ఏళ్ల లూసి డన్లాన్‌ను ఈ ఏడాది మొదట్లో ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో చూసి ముచ్చటపడ్డారు. ఆ తర్వాత అనతి కాలంలోనే వారిద్దరు కలిసి తిరగడం చూసిన ప్రజలు ఆశ్చర్య పడ్డారు. షేన్‌వార్న్‌ పెద్ద కూతురుకంటే లూసి వయస్సులో చిన్నదట!

షేన్‌వార్న్‌ జీవితంలోని ముఖ్య ఘట్టాలు
1993లో అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రముఖ బౌలర్‌గా గుర్తింపు పొందారు.
1995లో సైమన్‌ కల్లాహన్‌ను షేన్‌ పెళ్లి చేసుకున్నారు.
2003లో నిషేధిత డ్రగ్‌ వాడడంతో క్రికెట్‌ టీమ్‌ నుంచి తప్పించారు. అందుకని ఆయన ఆ ఏడాది వరల్డ్‌ కప్‌ సిరీస్‌లో ఆడలేక పోయారు.
2005లో సైమన్‌కు షేన్‌ విడాకులు
2006లో  కెరీర్‌లో 703 వికెట్లు తీసుకొన్న షేన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు.
2011లో లిజ్‌ హర్లీతో రెండేళ్లు ప్రేమాయణం నడిపారు.
2014లో ‘ప్లే బాయ్‌’ మోడల్‌ ఎమిలీ స్కాట్‌తో ప్రేమాయణం.
2019లో అజ్ఞాత ప్రేయసితో సంసారం.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా