ధోని విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి

12 Mar, 2019 21:09 IST|Sakshi

న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా-టీమిండియాల మధ్య జరిగిన నాలుగో వన్డే అనంతరం ఎంఎస్‌ ధోనిని విమర్శించిన వాళ్ల నోళ్లు మూత పడ్డాయని మాజీ దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ పేర్కొన్నాడు. ధోనిని రిటైర్మెంట్‌ తీసుకొమ్మని ఉచిత సలహాలు ఇచ్చిన వారికి అతడి విలువ ఏంటో ఇప్పటికైనా తెలిసిందా అంటూ ప్రశ్నించారు. ఆసీస్‌తో జరిగిన నాలుగో వన్డేల్లో ధోని లేని లోటు స్పష్టంగా కనిపించిందన్న వార్న్‌.. మూడు వందలకు పైగా పరుగులు లక్ష్యాన్ని కూడా టీమిండియా కాపాడుకోలేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. నాలుగో వన్డేలో వికెట్ల వెనుకాలా ఉండి ప్రశాంతంగా అతను రచించే వ్యూహాలు మిస్సయ్యాయని, టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి కూడా ధోని సూచనలు లేక అయోమయానికి గురయ్యాడని వార్న్‌ పేర్కొన్నాడు. 
ఇలా ఆడితే ప్రపంచకప్‌ ఆసీస్‌దే
ఇప్పటికైనా ప్రపంచకప్‌లో ధోని అవసరం ఎంత ఉందో అందరూ అర్థం చేసుకోవాలన్నాడు. బ్యాటింగ్‌లో ఏ స్థానంలోనైనా ఆడగల సత్తా ధోనికి ఉందన్నాడు. రిషభ్‌ పంత్‌, కుల్దీప్‌ యాదవ్‌, చహల్‌ వంటి యువ ఆటగాళ్లు చేసిన పొరపాట్ల నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలన్నాడు. ఇక ఆసీస్‌ ఆటగాళ్ల ప్రదర్శన ఇప్పుడు మంచి పీక్స్‌లో ఉందన్నాడు. ఆటగాళ్లు సమిష్టిగా ఆడటం నేర్చుకుంటున్నారని కితాబిచ్చాడు. ప్రపంచకప్‌ వరకు పాత ఆసీస్‌ జట్టు ఆటను చూడవచ్చన్నాడు. ఇదే ఆటను కొనసాగిస్తే ప్రపంచకప్ గెలిచే అవకాశాలు ఆసీస్‌కు పుష్కలంగా ఉన్నాయన్నాడు. అయితే ఇప్పటివరకు భారత్‌, ఇంగ్లండ్‌ జట్లు మాత్రమే ప్రపంచకప్‌లో హాట్‌ ఫేవరెట్‌ అంటూ వార్న్‌ అభిప్రాయపడ్డాడు.  
ధోని లేకపోవడం వల్లనే ఓటమి: మాజీ క్రికెటర్‌     
పంత్‌లో ధోనిని వెతకడం ఆపండి..

మరిన్ని వార్తలు