మిశ్రా మిస్సైల్

1 Nov, 2016 23:59 IST|Sakshi
మిశ్రా మిస్సైల్

అమిత్ మిశ్రా... నిజానికి అంతర్జాతీయ క్రికెట్‌లోకి ధోని కంటే ముందు వచ్చాడు. దాదాపు 13 ఏళ్ల క్రితం తను తొలి వన్డే ఆడాడు. కానీ ఇప్పటికీ అతను ఆడిన వన్డేల సంఖ్య 36. అలా అని తనేమైనా ఫెరుులయ్యాడా?అంటే లేదు. 4.72 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 64 వికెట్లు తీశాడు. మరో 15 రోజుల్లో తనకు 34 ఏళ్లు నిండుతారుు. నిజానికి ఇది ఓ క్రికెటర్ రిటైర్‌మెంట్‌కు దగ్గరైన వయసు. కానీ మిశ్రా అలా కనిపించడం లేదు. రోజు రోజుకూ మరింత చురుగ్గా తయారవుతున్నాడు. ఒక రకంగా సుదీర్ఘ కెరీర్‌లో తన నైపుణ్యానికి తగిన గుర్తింపు మిశ్రాకు దక్కలేదు.

అనిల్ కుంబ్లే రిటైరైన తర్వాత మారిన పరిణామాలు, కూర్పులతో మరో లెగ్ స్పిన్నర్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమైంది. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్, ఆల్‌రౌండర్‌గా జడేజా లేదా మరో స్పిన్ ఆల్‌రౌండర్ కారణంగా లెగ్ స్పిన్నర్‌కు అవకాశం లేకపోరుుంది. నిజానికి ఈ సిరీస్‌లోనూ అశ్విన్‌కు విశ్రాంతి ఇవ్వకపోరుు ఉంటే మిశ్రా తుది జట్టులో ఉండేవాడు కాదేమో. ఇంతటి క్లిష్ట స్థితిలో కూడా తనకు లభించిన ప్రతి చిన్న అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్న మిశ్రాకు ఇంతకాలానికై నా గుర్తింపు లభించింది. కానీ మిశ్రా రాబోయే మ్యాచ్‌ల్లో కూడా తుది జట్టులో ఉంటాడా అనేదే అసలు ప్రశ్న.

సాక్షి క్రీడావిభాగం  షేన్ వార్న్, అనిల్ కుంబ్లే రిటైరైన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో లెగ్ స్పిన్నర్ల వైభవం కాస్త తగ్గిందనే చెప్పుకోవాలి. కానీ మొహాలీ వన్డేలో టేలర్, రోంచీ అవుటైన బంతులు, విశాఖపట్నంలో నీషమ్ అవుటైన బంతిని చూస్తే లెగ్ స్పిన్ కళను మిశ్రా బతికిస్తున్నాడని అనిపించింది. ఈ మూడు బంతులూ అద్భుతాలే. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ తర్వాత మరోసారి అమిత్ మిశ్రా గురించి చర్చ మొదలైంది. వైజాగ్ వన్డేలో తను ఐదు వికెట్లు తీయడం ద్వారా... స్పిన్‌కు సహకరించే పిచ్‌లపై తన అవసరం ఎంత ఉందో మరోసారి చూపించాడు. రాబోయే ఇంగ్లండ్ సిరీస్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడితే మిశ్రా కచ్చితంగా తుది జట్టులో ఉంటాడు. ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లే చాలనుకుంటే మరోసారి బెంచ్‌కే పరిమితం కావలసి వస్తుందేమో అనే ఆందోళన ఉంది. అరుుతే వన్డేల్లో ప్రదర్శన ద్వారా తను కచ్చితంగా టెస్టుల్లో తుది జట్టులోనూ రేసులోకి వచ్చాడు.

వికెట్ల స్పెషలిస్ట్
జట్టుకు అవసరమైన సందర్భంలో వికెట్ తీయాలంటే మిశ్రా ఉండాలి. ‘మిశ్రాకు బంతి ఇస్తే కచ్చితంగా వికెట్ తీస్తాడు’ అన్ని స్థారుుల క్రికెట్‌లోనూ తనకు ఈ పేరు ఉంది. వన్డేల్లో మధ్య ఓవర్లలో బ్యాట్స్‌మెన్ భారీ షాట్లకు వెళ్లకుండా నెమ్మదిగా ఆడే సమయంలో వికెట్లు తీయడంలో తను నిపుణుడు. 2014లో బంగ్లాదేశ్‌లో జరిగిన టి20 ప్రపంచకప్‌లో మిశ్రా 10 వికెట్లు తీశాడు. అశ్విన్ 11 వికెట్లు తీయగా... రెండో స్థానం మిశ్రాదే. కానీ రెండేళ్ల పాటు తనకు మరో టి20 మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. స్వదేశంలో జరిగిన టోర్నీలోనూ తనను తీసుకోలేదు. జింబాబ్వేలో ద్వితీయశ్రేణి ఆటగాళ్లతో సిరీస్ ఆడిన సమయంలో మాత్రమే తనకు మళ్లీ అవకాశం వచ్చింది. నిజానికి దీనికి ఎవరినీ తప్పుబట్టలేం. మిశ్రా ఫీల్డింగ్‌లో బాగా నెమ్మది. బ్యాటింగ్‌లోనూ లోయర్ ఆర్డర్‌లో పెద్దగా ఉపయోగపడడు. ఈ రెండు కారణాల వల్ల తను కాస్త వెనకబడ్డ మాట వాస్తవం. అందుకే గత ఏడాది కాలంలో తను ఈ రెండు అంశాలపై దృష్టి పెట్టాడు. ఇప్పుడు కాస్త మెరుగయ్యాడు. నిజానికి తన బ్యాటింగ్ ఇంకాస్త మెరుగుపడితే కచ్చితంగా తను తుది జట్టులో ఉంటాడు. తన కెరీర్‌లో మిశ్రా ఐదు వన్డేల సిరీస్‌లో పూర్తిగా ఐదు మ్యాచ్‌లు ఇప్పటికి రెండుసార్లు మాత్రమే ఆడాడు. రెండు సందర్భాల్లోనూ ఒకసారి 18 వికెట్లు, ఒకసారి 15 వికెట్లు తీశాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్ల రికార్డుల జాబితాలో తొలి రెండు స్థానాలు మిశ్రావే. ఈ గణాంకం చాలు... తనకు పూర్తి స్థారుులో అవకాశం లభిస్తే ఏం చేయగలడో చెప్పడానికి.

ఆశావహ దృక్పథం...
నిజానికి జట్టుతో పాటే తిరుగుతూ తుది జట్టులో అవకాశం రాకుండా నెలలు నెలలు గడపడం చాలా కష్టం. మ్యాచ్‌లో లేకపోరుునా పూర్తిగా ఫిట్‌నెస్‌తో ఉండాలి. ఎప్పుడు అవకాశం వచ్చినా కచ్చితంగా రాణించాలనే ఒత్తిడి ఉంటుంది. మానసికంగా కూడా ఇది చాలా కష్టం. అరుునా మిశ్రా నిరాశపడకుండా వేచి చూశాడు. ‘నా చేతుల్లో లేని అంశం గురించి నేనెప్పుడూ ఆలోచించను. నా ఫిట్‌నెస్‌ను, బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకోవడమే నా చేతుల్లో ఉంది. అది తప్ప వేరే ఏదీ ఆలోచించను. అవకాశం వచ్చినప్పుడు నా పూర్తి సామర్థ్యంతో జట్టుకు ఉపయోగపడటమే క్రికెటర్‌గా నా లక్ష్యం’ అని మిశ్రా చెప్పాడు. ఆశావహ దృక్పథంతో ముందుకు వెళ్లడం వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఇప్పటికీ అవకాశం దొరికిన ప్రతిసారీ మెరుస్తున్నాడు.

అన్ని చోట్లా నిలకడ...
కెరీర్ ఆరంభం నుంచి మిశ్రా ఫామ్‌లో లేడనో, సరిగా ఆడటం లేదనో మాట ఇప్పటివరకూ వినపడలేదు. రంజీల్లో హరియాణా జట్టుకు దశాబ్దానికి పైగా వెన్నెముకలా నిలిచాడు. అలాగే ఐపీఎల్‌లో మూడుసార్లు హ్యాట్రిక్ తీసిన ఒకే ఒక్క బౌలర్‌గా ఘనత సాధించాడు. భారత టెస్టు జట్టులోనూ ఏనాడూ నిరాశపరచలేదు. 2015లో శ్రీలంకలో జరిగిన సిరీస్‌లో ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతో ఆడాలని కోహ్లి భావించడం మిశ్రాకు కలిసొచ్చింది. ఆ సిరీస్‌లో అశ్విన్‌కు ధీటుగా రాణించి 15 వికెట్లు తీశాడు. అప్పటి నుంచి జట్టుతో పాటే ఉన్నా... తుది జట్టులో అవకాశాలు పెద్దగా రాలేదు. నిజానికి మిశ్రా టాలెంట్‌ను భారత్ పూర్తిగా ఉపయోగించుకోలేదు. వయసు దృష్ట్యా తను మహా అరుుతే మరో మూడు, నాలుగేళ్లు ఆడతాడేమో. కాబట్టి కెరీర్ చివరి దశలో అరుునా తనకు అవకాశాలు పెరిగితే... అది భారత క్రికెట్‌కే మేలు చేస్తుంది.

కుంబ్లే ప్రోత్సాహం
నిజానికి మిశ్రా కెరీర్ ఆలస్యం కావడానికి కుంబ్లే కూడా ఓ కారణం. కుంబ్లే బాగా ఆడుతున్న సమయంలోనే మిశ్రా కెరీర్ కూడా మొదలైంది. ఇద్దరు లెగ్ స్పిన్నర్లకు అవకాశం ఉండదు కాబట్టి సహజంగానే అవకాశాలు రాలేదు. 2008లో మొహాలీలో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ సందర్భంగా కుంబ్లే అనారోగ్యం కారణంగా మిశ్రాకు తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. ఆ మ్యాచ్‌లో తన తొలి ఇన్నింగ్‌‌సలోనే ఐదు వికెట్లు తీసి సత్తా చాటి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత అదే సిరీస్‌లో తర్వాతి మ్యాచ్‌తోనే కుంబ్లే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో మిశ్రాకు ఇక తిరుగులేదని భావించారు. కానీ మూడేళ్లలోనే పరిస్థితి మారిపోరుుంది. అశ్విన్ శకం మొదలైంది. అప్పటినుంచి ముగ్గురు స్పిన్నర్లు ఆడితే తప్ప మిశ్రాకు తుది జట్టులో చోటు లేని పరిస్థితి. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ కుంబ్లే కోచ్‌గా డ్రెస్సింగ్‌రూమ్‌లోకి వచ్చాడు. ఒక లెగ్ స్పిన్నర్ బాధను మరో లెగ్ స్పిన్నర్ బాగా అర్థం చేసుకుంటాడన్నట్లు... మిశ్రా పరిస్థితి కోచ్‌కు అర్థమైంది. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో మూడు మ్యాచ్‌లకూ మిశ్రా డ్రెస్సింగ్‌రూమ్‌కే పరిమితమయ్యాడు. ‘ఆందోళన వద్దు. నీకూ సమయం వస్తుంది’ అని కుంబ్లే ధైర్యం చెప్పాడట. కోచ్ సలహాలు తన బౌలింగ్ శైలిలోనూ మార్పులు తెచ్చాయని చెప్పాడు. ‘ఫీల్డర్లను ఎలా సెట్ చేసుకోవాలి, బంతుల్లో మార్పులు లాంటి విషయాలతో పాటు మానసికంగా దృఢంగా తయారు కావడానికి కుంబ్లే సలహాలు ఉపయోగపడ్డారుు. అలాగే బ్యాటింగ్‌లో మెరుగుపడటం ఎందుకు కీలకమో వివరించాడు. అనిల్ భాయ్ సలహాలు నాలో ఎంతో మార్పు తెచ్చారుు’ అని మిశ్రా చెప్పాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు