టీమిండియా లక్ష్యం 271

18 Oct, 2015 17:40 IST|Sakshi
టీమిండియా లక్ష్యం 271

రాజ్ కోట్:  టీమిండియాతో ఇక్కడ ఆదివారం జరుగుతున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 271 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు డీ కాక్, డేవిడ్ మిల్లర్ లు శుభారంభం అందించారు. గత  రెండు వన్డేల్లో విఫలమైన మిల్లర్ (33) ఈమ్యాచ్ లో ఫర్వాలేదనిపించినా, మరో ఓపెనర్ డీ కాక్ సెంచరీతో చెలరేగాడు. డీ కాక్ (103;; 118 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) నమోదు చేసి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు.  
 

ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా 38.5  ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులతో భారీ స్కోరు దిశగా వెళుతున్నట్లు కనిపించినా..  చివరి 11.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 65 పరుగులు మాత్రమే చేసింది.  స్వల పరుగుల వ్యవధిలో డీ కాక్, ఏబీ డివిలియర్స్(4), జేపీ డుమిని(14)లు పెవిలియన్ కు పంపి దక్షిణాఫ్రికాను టీమిండియా కట్టడి చేసింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డు ప్లెసిస్(60; 63 బంతుల్లో 6 ఫోర్లు) , బెహర్దియన్ (33 నాటౌట్) ఆకట్టుకోవడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఏడు  వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో మోహిత్ శర్మకు రెండు వికెట్లు లభించగా, హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రా,అక్షర్ పటేల్ లకు తలో వికెట్ దక్కింది.

మరిన్ని వార్తలు