ఆందోళన చెందుతున్న ముస్తాఫిజర్!

25 May, 2016 17:51 IST|Sakshi
ఆందోళన చెందుతున్న ముస్తాఫిజర్!

న్యూఢిల్లీ:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్నది తొలిసారి. అయితేనేం తనదైన బౌలింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు ఆ యువ బౌలర్. సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఈ రోజు రాత్రి కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనున్న మ్యాచ్ లో కీలక బౌలర్లలో అతడు ఒకడు. మీరు ఊహించినది కరెక్టే. ఆ యువ బౌలర్ మరేవరో కాదు ముస్తాఫిజర్ రెహ్మాన్. బంగ్లాదేశ్ యువ సంచలనం ముస్తాఫిజర్ రెహ్మాన్ ఈ సీజన్లో ఐపీఎల్ కెరీర్ మొదలుపెట్టాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున 14 మ్యాచులాడిన ముస్తాఫిజర్ 16 వికెట్లు పడగొట్టాడు. ముస్తాఫిజర్ ఏ విషయాలలో ఆందోళన చెందుతాడో.. ఆ సీక్రెట్స్ తెలిసిపోయాయి. టీమ్ మెట్ రికీ బుయి ముస్తాఫిజర్ భయాలను బయటపెట్టేశాడు.

చేతిలో బంతి ఉన్నప్పుడు అద్భుతాలు చేస్తూ టాపార్డర్ బ్యాట్స్ మన్లను సైతం ఇక్కట్లకు గురిచేసే యువ బౌలర్ రెండు విషయాలలో ఆందోళన చెందుతాడట. ఒకటి బ్యాటింగ్ చేయడం. రెండోది ఇంగ్లీష్ లో మాట్లాడటం. ఈ రెండు విషయాలు ముస్తాఫిజర్ కు కొరకరాని కొయ్యగా మారాయని రికీ బుయి చెప్పాడు. తనకు బెంగాళీలో బౌలింగ్ ప్లాన్ ముస్తాఫిజర్ చెబుతాడని, స్ట్రాటెజిక్ టైమ్ అవుట్ సమయంలో కెప్టెన్ డేవిడ్ వార్నర్ కు ముస్తాఫిజర్ చెప్పిన ఫీల్డింగ్ సెట్ అప్, బౌలింగ్ వ్యూహాలను అనువాదం చేసి వివరిస్తానని వెల్లడించాడు.

మరిన్ని వార్తలు