ఆ మ్యాచ్‌లో గెలిస్తే.. టీమిండియా కొత్త రికార్డు

25 Feb, 2020 16:30 IST|Sakshi

క్రైస్ట్‌చర్చి : ఫిబ్రవరి 29 నుంచి క్రైస్ట్‌చర్చి వేదికగా జరగనున్న రెండో టెస్టులో విజయం సాధించాలని టీమిండియా, న్యూజిలాండ్‌ జట్లు సిద్దంగా ఉన్నాయి. ఇప్పటికే టీమిండియాపై 3-0 తేడాతో వన్డే సిరీస్‌, 10 వికెట్ల తేడాతో తొలి టెస్టును కైవసం చేసుకొన్న కివీస్‌ రెండో టెస్టులోనూ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని భావిస్తుంది. మరోవైపు  టెస్టు చాంపియన్‌షిప్‌లో తొలి ఓటమి తర్వాత కనీసం రెండో మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తుంది. అయితే రెండో టెస్టు జరగనున్న క్రైస్ట్‌చర్చి నగరంలోనే రెండు మైదానాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏఎంఐ స్టేడియం కాగా మరొకటి హెగ్లే ఓవల్‌ స్టేడియం ఉన్నాయి. 
(మోదీపై ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు)

టీమిండియా ఇప్పటివరకు ఏఎంఐ స్టేడియంలో  నాలుగు టెస్టులు ఆడగా రెండు ఓటమిపాలై రెండు డ్రాగా ముగించింది. కాగా హెగ్లే ఓవల్‌ మైదానంలో మాత్రం ఇంతవరకు టీమిండియా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. శనివారం నుంచి మొదలుకానున్న రెండో టెస్టు మ్యాచ్‌ భారత్‌కు తొలి మ్యాచ్‌ కానుంది. ఈ మ్యాచ్‌లో గనుక విజయం సాధిస్తే క్రైస్ట్‌చర్చిలో తొలి విజయంతో పాటు టీమిండియా పేరిట కొత్త రికార్డు నమోదవుతుంది. మరోవైపు న్యూజిలాండ్‌ జట్టు ఇక్కడ ఆడిన ఆరు టెస్టుల్లో నాలుగు గెలుచుకొని, ఒక మ్యాచ్‌లో ఓటమి చెంది మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. 
(టెస్టు ఓటమి.. కపిల్‌ ప్రశ్నల వర్షం)
(‘అప్పుడు ధోని ఏం చెప్పాడంటే?’)

మరిన్ని వార్తలు