ప్రపంచ నంబర్‌వన్‌గా మానవ్‌ ఠక్కర్‌

4 Jan, 2020 10:04 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత యువ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) క్రీడాకారుడు మానవ్‌ ఠక్కర్‌ అండర్‌–21 పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించాడు. గత నెలలో జరిగిన నార్త్‌ అమెరికా ఓపెన్‌ టోర్నీలో మానవ్‌ విజేతగా నిలిచాడు.

దాంతో అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) శుక్రవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో మానవ్‌ తొమ్మిది స్థానాలు ఎగబాకి టాప్‌ ర్యాంక్‌ను అధిరోహించాడు. గతంలో భారత్‌ తరఫున అండర్‌–21 విభాగంలో హర్మీత్‌ దేశాయ్, సత్యన్, సౌమ్యజిత్‌ ఘోష్‌ ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచారు.    

 

మరిన్ని వార్తలు