రాహుల్‌ను వదులుకున్న టైటాన్స్‌ 

15 May, 2018 01:49 IST|Sakshi

30, 31 తేదీల్లో ప్రొ కబడ్డీ వేలం

చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)లో తెలుగు టైటాన్స్‌ ఆశ్చర్యకరంగా తమ స్టార్‌ ఆటగాడు రాహుల్‌ చౌదరిని వద్దనుకుంది. ఆరో సీజన్‌ కోసం అతను  వేలానికి రానున్నాడు. ఈ నెల 30, 31 తేదీల్లో ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు ముంబైలో జరిగే ఈ వేలం ప్రక్రియలో 422 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నట్లు పీకేఎల్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ జాబితాలో 14 దేశాలకు చెందిన 58 మంది విదేశీ ఆటగాళ్లుండగా, 87 మంది ఫ్యూచర్‌ కబడ్డీ హీరోస్‌ (ఎఫ్‌కేహెచ్‌) కార్యక్రమం ద్వారా అర్హత సాధించిన వారున్నారు.

దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిభాన్వేషణ పోటీల ద్వారా వీరంతా వేలానికి అర్హత పొందారు. మొత్తం 12 ఫ్రాంచైజీల్లో 9 ఫ్రాంచైజీలు 21 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. మూడు ఫ్రాంచైజీలు మాత్రం ఏ ఒక్కరినీ రిటెయిన్‌ చేసుకోలేదు. జట్టు మొత్తానికి కొత్త రూపు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ సహ యజమానిగా ఉన్న తమిళ్‌ తలైవాస్‌ అజయ్‌ ఠాకూర్, అమిత్‌ హుడా, అరుణ్‌లను అట్టి పెట్టుకుంది. తెలుగు టైటాన్స్‌ ఫ్రాంచైజీ రాహుల్‌ను కాదని నితేశ్‌ సాలుంకే, మోసెన్‌ (ఇరాన్‌)లను రిటెయిన్‌ చేసుకుంది.   

మరిన్ని వార్తలు