గెలిస్తే... సిరీస్‌ మనదే 

18 Feb, 2018 00:21 IST|Sakshi
మిథాలీ

 నేడు భారత్, దక్షిణాఫ్రికా మహిళల మూడో టి20 మ్యాచ్‌  

జొహన్నెస్‌బర్గ్‌: ఓవైపు పురుషుల జట్టు వన్డేల్లో సఫారీలను చితగ్గొట్టి సిరీస్‌ కొల్లగొడితే, మరోవైపు మహిళల జట్టూ అదే పని చేసింది. ఈసారి పురుషుల జట్టు టి20లు ఆడబోయే సమయానికి మహిళలు పొట్టి ఫార్మాట్‌లో సిరీస్‌ విజయానికి చేరువగా వచ్చారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు గెలిచి ఊపు మీదున్న హర్మన్‌ప్రీత్‌ బృందం... ఆదివారం మూడో మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమైంది. దీంట్లోనూ గెలుపొందితే దక్షిణాఫ్రికాలో వన్డే, టి20 సిరీస్‌లు సాధించిన తొలి జట్టుగా చరిత్రలో నిలుస్తుంది.

భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30కు వాండరర్స్‌ మైదానంలో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ ముగిసిన అనంతరం పురుషుల జట్టు మ్యాచ్‌ మొదలవనుండటం విశేషం. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, మిథాలీ అద్భుత ఫామ్, బౌలింగ్‌లో స్పిన్నర్లు అనూజ, పూనమ్‌ రాణిస్తుండటంతో మన జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గాయంతో సిరీస్‌ నుంచి వైదొలగిన జులన్‌ గోస్వామి స్థానంలో రుమేలీ ధర్‌ను ఎంపిక చేశారు.  

మరిన్ని వార్తలు