ఇద్దరు పాక్ హాకీ ఆటగాళ్లపై వేటు

14 Dec, 2014 20:06 IST|Sakshi

భువనేశ్వర్: చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత్తో సెమీ ఫైనల్ సందర్భంగా అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు పాకిస్థాన్ ఆటగాళ్లపై వేటు పడింది. ఫైనల్ మ్యాచ్ ఆడకుండా మహ్మద్ తౌషిక్, అలీ అంజాద్లను సస్పెండ్ చేశారు.

భారత్తో శనివారం జరిగిన సెమీస్ మ్యాచ్ సందర్భంగా మహ్మద్ తౌషిక్, అలీ అంజాద్ అనుచితంగా ప్రవర్తించారు. దీంతో వీరిద్దరై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్టు అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రకటించింది. పాక్ చీఫ్ కోచ్ షెహనాజ్ షేక్ ఆటగాళ్ల తరపున క్షమాపణలు చెప్పినా మన్నించలేదు. దీంతో ఫైనల్ ముందు పాక్కు షాక్ తగిలింది.
 

>
మరిన్ని వార్తలు