కశ్యప్‌ ముందంజ

22 Jul, 2017 00:40 IST|Sakshi
కశ్యప్‌ ముందంజ

కాలిఫోర్నియా: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, సమీర్‌ వర్మ, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో కశ్యప్‌ 21–19, 21–10తో నికులా కరుణరత్నె (శ్రీలంక)పై గెలుపొందాడు. అంతకుముందు జరిగిన రెండో రౌండ్‌లో కశ్యప్‌ 21–18, 17–6తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి గెర్గిలీ క్రసుజ్‌ (హంగేరి) గాయంతో వైదొలిగాడు

. ఇతర మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో సమీర్‌ వర్మ 18–21, 21–14, 21–18తో తొమ్మిదో సీడ్‌ యోగర్‌ కోల్‌హో (బ్రెజిల్‌)పై, ప్రణయ్‌ 21–8, 14–21, 21–16తో మార్క్‌ కాల్జు (నెదర్లాండ్స్‌)పై విజయం సాధించారు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో సమీర్‌ వర్మతో కశ్యప్‌; సునెయామ (జపాన్‌)తో ప్రణయ్‌ తలపడతారు. మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో శ్రీకృష్ణప్రియ 11–21, 10–21తో జాంగ్‌ మీ లీ (కొరియా) చేతిలో, రితూపర్ణ దాస్‌ 15–21, 20–22తో నటాలియా కోచ్‌ రోడ్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడిపోయారు.

మరిన్ని వార్తలు