పాక్‌ క్రికెట్‌ జట్టులో కోహ్లి, ధావన్‌.. వీడియో వైరల్‌

8 Sep, 2019 14:07 IST|Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు తరఫున టీమిండియా ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, శిఖర్‌ ధావన్‌లు ఆడినట్లు ఉన్న ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా ఆటగాళ్లు అయ్యి ఉండి పాకిస్తాన్‌ తరఫున ఆడటం, అందులోనూ దాయాది దేశం కోసం ఆడటాన్ని భారత క్రికెట్‌ అభిమానులు ఎంతమాత్రం సహించరు. కాకపోతే ఇది ఎవరో సృష్టించిన వీడియో. దీన్ని ఒక పాకిస్తాన్‌ జర్నలిస్టు షేర్‌ చేశాడు.  ఇందుకు ఒక క్యాప్షన్‌ కూడా ఇచ్చాడు. ‘పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు శ్రీనగర్‌లో క్రికెట్‌ ఆడుతుంది. పాకిస్తాన్‌ తరఫున కోహ్లి ఆడుతున్నాడు’ అని పేర్కొన్నాడు. 2025లో శ్రీనగర్‌ క్రికెట్‌ స్టేడియంలో టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ భాగంగా కోహ్లి, ధావన్‌లు పాకిస్తాన్‌ జట్టు తరఫున ఆడుతున్నట్లు చూపించారు. పాకిస్తాన్‌ ప్రత్యర్థి ఇంగ్లండ్‌ కాగా, కోహ్లి, ధావన్‌లతో పాటు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజాలు కూడా గ్రీన్‌ జెర్సీల్లో ఉన్నట్లు ఒక వీడియోను సృష్టించి వైరల్‌ చేశారు.

గత శుక్రవారం అంటే సెప్టెంబర్‌6వ తేదీన పాకిస్తాన్‌ డిఫెన్స్‌ డే జరుపుకుంది. ఈ మేరకు ఒక వీడియోను రూపొందించడమే కాకుండా భారత ప్రధాన ఆటగాళ్లంతా పాక్‌ తరఫున ఆడుతున్నట్లు చిత్రీకరించారు. ఈ మ్యాచ్‌ను కొంతమంది కలిసి చూస్తుండగా అందులో ఒక బాలిక మాట్లాడుతూ.. ‘ ఈరోజు పాకిస్తాన్‌ను కోహ్లి గెలిపిస్తాడు’ అని పేర్కొనడాన్ని కూడా జత చేశారు. దీనిపై భారత క్రికెట్‌ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. ‘ కోహ్లి పాకిస్తాన్‌ తరఫున ఆడటమా.. అది ఎప్పటికీ జరగదు’ అని ఒకరు కామెంట్‌ చేయగా, ‘భారత జట్టులోని ఆటగాళ్లంటే పాకిస్తాన్‌కు ఎంత ప్రేమో’ అని మరొకరు పేర్కొన్నారు. ‘ శిఖర్‌ ధావన్‌ను 3వ స్థానంలో ఆడించండి’ మరొకరు సెటైర్‌ వేశారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బీసీసీఐకి బేషరతుగా క్షమాపణ!

గ్రాండ్‌స్లామ్‌ సాధించిన 19 ఏళ్ల సంచలనం

ఇంగ్లండ్‌ ఇక కష్టమే..!

దులీప్‌ ట్రోఫీ విజేత ఇండియా రెడ్‌

నాదల్‌ను ఆపతరమా!

అరెస్ట్‌ వారెంట్‌.. షమీ బెయిల్‌ ప్రయత్నాలు

టీ ‘20’ స్థానాలు ఎగబాకాడు..!

ముగాబే మృతిపై ఒలోంగా ఏమన్నాడంటే..?

‘నన్ను చిన్నచూపు చూశారు’

మన టాపార్డర్‌ సూపర్‌ కదా.. అందుకే!: యువీ

దిగ్గజాల సరసన రషీద్‌ ఖాన్‌

వార్నర్‌ రియాక్షన్‌ అదిరింది!

‘మంచి స్నేహితున్ని కోల్పోయాను’

హార్దిక్‌ ‘భారీ’ ప్రాక్టీస్‌

19వ గ్రాండ్‌స్లామ్‌పై గురి

కొడుకు కోసం.. కిక్‌ బాక్సింగ్‌ చాంపియనై..

విజేతలు పద్మశ్రీ, మనో వెంకట్‌

భారత సైక్లింగ్‌ జట్టులో తనిష్క్‌

పాక్‌ స్పిన్‌ దిగ్గజం కన్నుమూత

ఇంగ్లండ్‌ ఎదురీత: ప్రస్తుతం 200/5

మెరిసిన సామ్సన్, శార్దుల్‌

దినేశ్‌ కార్తీక్‌కు బీసీసీఐ షోకాజ్‌ నోటీసు

4 బంతుల్లో 4 వికెట్లు

సెరెనా...ఈసారైనా!

‘ఆ దమ్ము బుమ్రాకే ఉంది’

దిగ్గజ ఫుట్‌బాలర్‌ ఇంట్లో తీవ్ర విషాదం

నన్ను కావాలనే ఇరికిస్తున్నారు: మునాఫ్‌

‘ఆ బ్యాటింగ్‌ టెక్నిక్‌ అతనికే సొంతం’

క్రికెటర్‌ నబీ సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

స్యామ్‌ కావాలనే ఆ దారిలో ...: నాగ చైతన్య

ఆ ఆశ ఉంది కానీ..!

కథానాయికలే కష్టపడుతున్నారు!

‘మేకప్‌తోనే అందం వస్తుందంటే నమ్మను’

ప్రముఖ సినీ గీతరచయిత కన్నుమూత

ఒక్క సెల్ఫీ భాయ్‌!