విజయ్‌ శంకర్‌ అరంగేట్రం

6 Mar, 2018 19:07 IST|Sakshi

కొలంబో:  ముక్కోణపు టీ 20  సిరీస్‌లో భాగంగా భారత్‌తో ఇక్కడ జరుగుతున్న తొలి మ్యాచ్‌లో శ్రీలంక టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన శ్రీలంక కెప్టెన్‌ దినేశ్‌ చండిమాల్‌ ముందుగా టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌ ద్వారా భారత్‌ బ్యాటింగ్‌ ఆల్‌ రౌండర్‌ విజయ్‌ శంకర్‌ అంతర్జాతీయ అరంగేట్రం చేయబోతున్నాడు. లంకతో మ్యాచ్‌లో విజయ్‌ శంకర్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.  ఇటీవల సఫారీలతో జరిగిన టీ 20 సిరీస్‌ను సాధించిన భారత్‌.. అదే ఊపును ఇక్కడ కూడా పునరావృతం చేయాలని భావిస్తోంది.

మరొకవైపు గతేడాది వరుస పరాజయాలతో డీలాపడిన శ్రీలంక... ఇటీవల బంగ్లాదేశ్‌ పర్యటనలో వన్డే టోర్నీ, టెస్టు సిరీస్‌ నెగ్గి ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. జట్టులోకి తిరిగొచ్చిన యువ బ్యాట్స్‌మన్‌ కుశాల్‌ మెండిస్‌ చక్కగా రాణించాడు. అయితే కీలక ఆటగాళ్లు గుణరత్నే, మాథ్యూస్‌ దూరమవడం లంకకు లోటుగా మారనుంది. కెప్టెన్‌ చండిమాల్, ఓపెనర్‌ ఉపుల్‌ తరంగాలతో పాటు తిసారా పెరీరాలే లంక బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కీలకం.

మరిన్ని వార్తలు