టాప్ ర్యాంక్ కోల్పోయిన విరాట్ కోహ్లి

12 Dec, 2013 17:02 IST|Sakshi
టాప్ ర్యాంక్ కోల్పోయిన విరాట్ కోహ్లి

భారతజట్టు వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ, భారత ఆటగాడు విరాట్ కోహ్లి రిలయన్స్ ఐసీసీ ప్లేయర్ ర్యాంకింగ్ లో టాప్ ర్యాంక్ ను కోల్పోయాడు.  ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్‌లో భారత జట్టు నెంబర్ వన్ స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా నిలిచింది. భారత్ 120 రేటింగ్ తో మొదటి ర్యాంక్ ను కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా జట్టు 114 రేటింగ్ తో రెండో ర్యాంక్ లో నిలిచింది. ఆ తరవాత స్థానాల్లో ఇంగ్లండ్(111), శ్రీలంక (111), దక్షిణాఫ్రికా (110), పాకిస్తాన్(100) వరుసగా నిలిచాయి.

టాప్ 10 ప్లేయర్ ర్యాంకింగ్‌లో..
సెంచురియన్ లో భారత్ తో జరిగిన మూడో చివరి వన్డే సిరీస్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిలియర్స్ నెంబర్ వన్ గా రిలయన్స్ ఐసీసీ ప్లేయర్ ర్యాకింగ్ బోర్డు పేర్కొంది. దీంతో వన్డేమ్యాచ్ లలో అత్యధిక పరుగులు చేసినా బ్యాట్స్ మెన్ గా డివిలియర్స్ ప్రసిద్ధికెక్కాడు. ఆ తరువాత భారత ఆటగాడు విరాట్ కోహ్లి రెండవ ర్యాంక్ లో నిలిచాడు. కెప్టెన్ ధోనీ ఆరో ర్యాంకు, శేఖర్ ధావన్ పదవ ర్యాంకులో నిలిచాడు. ఆ తరువాత  రోహిత్ శర్మ 18వ ర్యాంకులో నిలిచాడు.

టాప్ 10 బౌలర్ ర్యాంకింగ్‌లో...
మొదటి ర్యాంకులో పాకిస్తాన్ స్పీన్ బౌలర్ సయిద్ అజ్మల్ కొనసాగుతున్నట్టు రిలయన్స్ ఐసీసీ ప్లేయర్ ర్యాంకింగ్‌ తెలిపింది. ఆ తరువాత దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ రెండవ ర్యాంక్ లో ఉన్నాడు. భారత్ బౌలర్ రవీంద్రా జడేజా టాప్ 10లో ఉండగా, ఆశ్విన్ 17వ ర్యాంకుతో టాప్ 20లో ఉన్నాడు. భారత్ ఈ సిరీస్ లలో 0-2 సిరీస్ లను రెండు రేటింగులు కోల్పోయి 120 రేటింగ్ పాయింట్స్ తో ముగిసింది. దక్షిణాఫ్రికా 5వస్థానంలో కొనసాగుతూ 110 రేటింగ్ పాయింట్స్ తో 3 పాయింట్స్ సొంతం చేసుకుంది.  
 
టాప్ 10 ఆల్ రౌండర్ ర్యాంకింగ్‌లో...
బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ ఆల్ హాసన్ మొదటి ర్యాంకులో ఉండగా, వాట్సన్ రెండవ ర్యాంకులో ఉన్నాడు. భారత ఆటగాడు రవీంద్రా జడేజా 5వ ర్యాంక్ లో నిలిచినట్టు రిలయన్స్ ఐసీసీ ప్లేయర్ ర్యాంకింగ్స్  తన జాబితాలో వెల్లడించింది.

మరిన్ని వార్తలు