స్టింగ్ ఆపరేషన్లో దొరికిన 11మంది ఎంపీలు | Sakshi
Sakshi News home page

స్టింగ్ ఆపరేషన్లో దొరికిన 11మంది ఎంపీలు

Published Thu, Dec 12 2013 4:40 PM

స్టింగ్ ఆపరేషన్లో దొరికిన 11మంది ఎంపీలు

ఢిల్లీ: కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్లో 11మంది ఎంపీలు అడ్డంగా దొరికిపోయారు. ఆయిల్ వెలికితీత కోసం నకిలీ సంస్థకు లైసెన్స్ ఇప్పించేందుకు 11 మంది ఎంపీలు పెట్రోలియం శాఖకు సిఫార్స్ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేశారు. ఒక్కో సిఫార్స్ లేఖకు రూ.50 వేల నుంచి రూ. 50 లక్షల వరకూ డిమాండ్ చేస్తూ ...కెమెరాకు చిక్కారు. ఈ నిర్వాకంలో ఇద్దరు కాంగ్రెస్, ముగ్గురు బీజేపీ, ఇద్దరు అన్నాడీఎంకే, ముగ్గురు జేడీయూ, ఒకరు బీఎస్పీ ఎంపీ ఉన్నారు.

 'ఆపరేషన్ ఫాల్కన్ క్లా' పేరుతో ఏడాది పాటు ఈ స్టింగ్ ఆపరేషన్ కొనసాగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో  కె సుగుమార్, సి. రాజేంద్రన్...(అన్నాడీఎంకే), లాలూ భాయ్ పటేల్, రవీంద్ర కుమార్ పాండే, హరి మంజి  (బీజేపీ), విశ్వమోహన్ కుమార్, మహేశ్వర్ హజారీ, బుడియో చౌదరి (జేడీయూ), ఖిలాది లాల్ బైర్వా, విక్రమ్ భాయ్ అర్జున్ భాయ్ (కాంగ్రెస్), కైసర్ జహన్ (బీఎస్పీ) ఉన్నారు.

Advertisement
Advertisement