ఎనిమిదేళ్ల తర్వాత కోహ్లి

18 Jan, 2018 12:23 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. 2017 సంవత్సరానికి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) విడుదల చేసిన తాజా అవార్డుల జాబితాలో క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌, వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌, సర్‌ గార్‌ఫీల్డ్‌ సోబర్స్‌  అవార్డులను గెలుచుకున్న కోహ్లి.. అదే ఏడాదికి ఐసీసీ టెస్టు, వన్డే జట్ల కెప్టెన్‌ పురస్కారాన్ని కూడా సొంతం చేసుకున్నాడు.

తద్వారా ఎనిమిదేళ్ల తర్వాత ఒకే ఏడాదిలో ఐసీసీ టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్‌గా ఎంపికైన తొలి భారత క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. 2009లో ఐసీసీ టెస్టు, వన్డే జట్లకు ధోని కెప్టెన్‌గా ఎంపికవ్వగా, తాజాగా ఆ ఘనతను కోహ్లి సాధించాడు. ఓవరాల్‌గా చూస్తే ఒకే ఏడాదిలో రెండు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఎంపికైన మూడో ఆటగాడిగా కోహ్లి గుర్తింపు పొందాడు.  2004,2007ల్లో రికీ పాంటింగ్‌(ఆసీస్‌) ఐసీసీ టెస్టు, వన్డే జట్లకు ఎంపికవ్వగా, ఆపై భారత్‌ నుంచి ధోని, కోహ్లిలు మాత్రమే ఆ ఘనతను సాధించారు.

మరిన్ని వార్తలు