ఉడీ బాధిత కుటుంబాలకు కోహ్లి సానుభూతి

27 Sep, 2016 03:08 IST|Sakshi
ఉడీ బాధిత కుటుంబాలకు కోహ్లి సానుభూతి

కాన్పూర్: ఇటీవల ఉడీ సెక్టార్‌లో ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు టెస్టుకెప్టెన్ విరాట్ కోహ్లి తన ప్రగాఢ సానుభూతిని తెలిపాడు. ఇలాంటి పిరికి చర్యలు దేశంలోని ప్రతి ఒక్కరి మనసును గాయపరుస్తాయని అన్నాడు. ‘నిరంతరం ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. సైనికుల కుటుంబాల గురించి ఆలోచిస్తే ఆవేదనగా ఉంది. ఓ భారతీయుడిగా ఈ దుర్ఘటనలో నష్టపోరుున కుటుంబాలకు సానుభూతి తెలుపుతు న్నాను’ అని కోహ్లి తెలిపాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు