ఫైనల్ కు చేరిన వావ్రింకా

6 Jun, 2015 14:34 IST|Sakshi
ఫైనల్ కు చేరిన వావ్రింకా

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ లో వావ్రింకా ఫైనల్లోకి ప్రవేశించాడు.  పురుషుల సెమీ ఫైనల్లో భాగంగా శుక్రవారం సోంగాతో జరిగిన పోరులో వావ్రింకా జయభేరి మోగించాడు.  వావ్రింకా 6-3, 6-7(1-7), 7-6, 6-4 తేడాతో సోంగాపై గెలిచి తుది పోరుకు సిద్ధమైయ్యాడు.  తొలి సెట్ ను అవలీలగా గెలిచిన వావ్రింకా..  రెండో గేమ్ ను కోల్పోయాడు.  వావ్రింకా అనవసర తప్పిదాలతో రెండో సెట్ ను సోంగాకు అప్పగించాడు.

 

అయితే ఆ తరువాత వరుసుగా మూడు, నాలుగు సెట్లలో మాత్రం సోంగాకు వావ్రింకా చుక్కలు చూపించాడు.  దీంతో జకోవిచ్-ముర్రే  సెమీ ఫైనల్ మ్యాచ్ విజేతతో వావ్రింకా ఆమీతుమీకి సిద్దమైయ్యాడు.

మరిన్ని వార్తలు