అలా ముంబైలో కుదరదు బ్రదర్‌

2 May, 2020 16:00 IST|Sakshi

మీలాగ అదృష్టవంతులం కాదు..

బ్రెట్‌లీకి రోహిత్‌ సమాధానం

ముంబై: కరోనా వైరస్‌ కారణంగా క్రికెట్‌ ఈవెంట్లకు బ్రేక్‌ పడటంతో అది క్రికెటర్లకు కాస్త నిరాశగానే ఉంది. ఎప్పుడు స్టేడియంలోకి వెళ్లి బ్యాట్‌, బంతి పట్టుకుందామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలా ఎదురు చూసేవాళ్లలో  టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఒకడు. అటు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌కు ఆటంకం ఏర్పడటంతో పాటు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి జిమ్‌లు కూడా ఇంకా ఓపెన్‌ కాకపోవడంతో రోహిత్‌ అసంతృప్తిగా ఉన్నాడు. ప్రస్తుతం ముంబై మహానగరంలో తాను ఉండే అపార్ట్‌మెంట్‌లో క్రికెట్‌ ఆడటానికి పెద్దగా చోటు లేకపోవడమే ఇందుకు కారణం. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ బ్రెట్‌ లీకి స్పష్టం చేశాడు రోహిత్‌. స్టార్‌ స్పోర్ట్స్‌ నిర్వహించిన క్రికెట్‌ కనెక్టడ్‌ షోలో బ్రెట్‌ లీతో మాట్లాడిన రోహిత్‌.. ముంబై ఎంత ఖరీదైన నగరమో వివరించాడు. (వేలానికి రికార్డు చేజింగ్‌ బ్యాట్‌..)

‘బ్రదర్‌ ముంబైలో ప్రతీకి కాస్ట్‌లీనే. ఇక విలాసవంతమైన ఇళ్లు కొనాలంటే మామూలు విషయం కాదు. ఇండోర్‌తో కూడిన ఇళ్లను తీసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాంతో ఇంటి పేరటిలో ప్రాక్టీస్‌ అనేది మాకు ఉండదు. ఈ విషయంలో మేము చాలా దురదృష్టవంతులం. మనం కొనాలనుకున్నా అది చాలా కష్టం. నేను క్రికెట్‌ ఆడటానికి ఇంటి వద్ద తగినంత స్థలం ఉండాలనే కోరుకున్నా. కానీ అది సాధ్యపడలేదు. నేను ఉండే ఇంటి స్థలం చాలా పరిమితంగానే ఉంటుంది. నీ అపార్ట్‌మెంట్‌లో నువ్వు ఉండాల్సిందే. మీలాగా క్రికెట్‌ ఆడటానికి ఇంటి ఆవరణలో ప్లేస్‌ అనేది ఉండదు కాకపోతే చిన్న బాల్కనీ ఉండటంతో ఎంతో కొంతో అది లక్కీ అనే చెప్పాలి. కొన్ని రోజువారీ దినచర్యలు(జిమ్‌ లాంటివి) చేసుకోవడానికి వీలవుతుంది. అంతే తప్ప భారీ షాట్లు ఆడే స్థలం లేదు. బంతిని హిట్‌ చేయడాన్ని మాత్రం మిస్సవుతున్నాను. ఎప్పుడెప్పుడు బయటకెళ్లి క్రికెట్‌ బ్యాట్‌తో మళ్లీ ప్రాక్టీస్‌ షురూ చేస్తానా అని ఆశగా చూస్తున్నా’ అని రోహిత్‌ తెలిపాడు. (ఆసీస్‌ క్రికెటర్లు.. ఇవి పాటించాల్సిందే!)

మరిన్ని వార్తలు