మహిళా రెజ్లర్లకు నిరాశ 

24 Oct, 2018 01:52 IST|Sakshi

బుడాపెస్ట్‌ (హంగేరి): ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్లు నిరాశపరిచారు. ఆరు వెయిట్‌ కేటగిరీల్లో ఒక్కరు కూడా సెమీఫైనల్‌కు చేరుకోలేకపోయారు. సీమ (55 కేజీలు), నవ్‌జ్యోత్‌ కౌర్‌ (68 కేజీలు), రజని (72 కేజీలు), కిరణ్‌ (76 కేజీలు) ప్రిక్వార్టర్‌ ఫైనల్లో... సరిత (59 కేజీలు), రీతూ (65 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయారు. సీమ 0–11తో దావాచిమెగ్‌ (మంగోలియా) చేతిలో... నవ్‌జ్యోత్‌ 0–4తో కుంబా ఫాంటా సెలెన్‌ (ఫ్రాన్స్‌) చేతిలో... రజని 0–2తో మార్టినా క్యునెజ్‌ (ఆస్ట్రియా) చేతిలో... కిరణ్‌ 2–12తో ఎల్మీరా సిజ్దికోవా (కజకిస్తాన్‌) చేతిలో ఓటమి పాలయ్యారు.

షూవ్‌డోర్‌ బతర్జావ్‌ (మంగో లియా) 10–0తో సరితపై, పెట్రా మారిట్‌ (ఫిన్‌లాండ్‌) 6–2తో రీతూపై గెలిచారు. నవ్‌జ్యోత్‌ కౌర్‌పై గెలిచిన సెలెన్‌... రీతూపై నెగ్గిన పెట్రా మారిట్‌ ఫైనల్‌కు చేరుకోవడం తో వీరిద్దరికి బుధవారం కాంస్యం గెలిచేందుకు రెప్‌చేజ్‌ బౌట్‌లలో అవకాశం దక్కింది.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు