పెవిలియన్‌కు క్యూ.. సన్నగిల్లిన ఆశలు

8 Mar, 2020 14:41 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా నిర్దేశించిన 185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది. 30 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. టీమిండియా బ్యాటింగ్‌​ ప్రారంభమైన మూడో బంతికే షఫాలీ వర్మ(2) పెవిలియన్‌ బాట పట్టింది. మెగాన్‌ షూట్‌ వేసిన బంతిని అంచనా వేడంలో విఫమైన షఫాలీ కీపర్‌ క్యాచ్‌ ఔట్‌ వెనుదిరిగారు. ఈ క్రమంలో అనూహ్యంగా క్రీజులోకి వచ్చిన తానియా భాటియా (2 రిటైర్డ్‌ హర్ట్‌) గాయం కారణంగా మైదానాన్ని వీడింది. 

ఈ సమయంలో జట్టను ఆదుకుంటాదనుకున్న జెమీమా రోడ్రిగ్స్‌ (0) అత్యంత నిర్లక్ష్యపు షాట్‌తో వికెట్‌ పారేసుకుంది. దీంతో 8 పరుగులకే రెండు కీలక వికెట్లను టీమిండియా చేజార్చుకుంది. అయితే సీనియర్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన రెండు ఫోర్లతో ఆశలు రేకెత్తించింది. అయితే సోఫియా ఊరిస్తూ వేసిన బంతికి మంధాన (11) బోల్తాపడింది. దీంతో స్టార్‌ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టి టీమిండియా గెలుపు ఆశలపై నీళ్లు చల్లారు. అయితే కీలక సమయంలో ఆదుకుంటాదని భావించిన సారథి హర్మన్‌ (4) కూడా తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఇప్పటికే గెలుపుపై ఆశలు సన్నగిల్లినప్పటికీ.. మిగతా బ్యాటర్లు ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి. 

>
మరిన్ని వార్తలు