గుర్తింపు రద్దయ్యేనా?

7 Oct, 2014 23:23 IST|Sakshi

 అడ్డగోలుగా ఫీజులు వసూలుచేసి వాటిని వెనక్కి వచ్చేయడానికి సుముఖంగా లేని ప్రైవేటు పాఠశాలల భరతం పట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒకవేళ ఈ పాఠశాలలు ఈ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయకపోయినట్టయితే ప్రభుత్వం వీటి గుర్తింపును రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి.

న్యూఢిల్లీ: పెద్దమొత్తంలో అదనపు ఫీజులను వసూలుచేసిన పాఠశాలలపై రాష్ర్ట ప్రభుత్వం కొరడా ఝళిపించనుంది. ఉన్నతన్యాయస్థానం నియమించిన జ్యుడీషియల్ ప్యానల్ ప్రస్తావించిన జాబితాలో ఉన్నప్పటికీ కోట్లాది రూపాయలమేర వసూలు చేసిన పాఠశాలల యాజమాన్యాలు ఆయా విద్యార్థుల తల్లిదండ్రులకు చెల్లించడానికి సుముఖత చూపడం లేదు. ఢిల్లీ హైకోర్టు వార ం క్రితం ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయా విద్యాసంస్థల జాబితాకు తుదిరూపమిస్తోంది. జస్టిస్ అనిల్ దేవ్ సింగ్ నేతృత్వంలోని కమిటీ అభిశంసించిన పాఠశాలల యాజమాన్యాలు ఫీజులను వాపసు ఇచ్చేందుకు చివరిచర్యగా వాటి గుర్తింపును ప్రభుత్వం రద్దు చేయనుంది. కాగా ఇటువంటి పాఠశాలలపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను ఈ నెల 28వ తేదీలోగా ఉన్నత న్యాయస్థానానికి సమర్పించడం అనివార ్యమవడంతో వాటిపై కొరడా ఝళిపించడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం ప్రభుత్వానికి లేకుండాపోయింది. ఈ అంశం 2009 నుంచి హైకోర్టులో నలుగుతోంది. ఆరో వేతన కమిషన్ సిఫారసులను అమలు చేయడం తప్పనిసరికావడంతో దీనినే సాకుగా చూపుతూ అనేక పాఠశాలల యాజమాన్యాలు అసాధారణ రీతిలో ఫీజులను పెంచేశాయి.
 
 దీంతో బెంబేలెత్తిన ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఆరో వేతన  కమిషన్ సిఫారసులను ఎంతమాత్రం అమలు చేయకుండానే ఆ పేరిట తమ వద్ద పెద్దమొత్తంలో అదనపు ఫీజులను వసూలు చేశాయని వారు తమ పిటిషన్‌లో ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున ఈ కేసును అడ్వొకేట్ అశోక్ అగర్వాల్ వాదించారు. ఈ పిటిషన్‌పై అనేక పర్యాయాల వాదోపవాదనల అనంతరం ఫీజుల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతికి సంబంధించిన నోటిఫికేషన్‌ను హైకోర్టు నియమించిన జ్యుడీషియల్ ప్యానల్ పరిశీలించింది. నగరంలోని మొత్తం 741 అన్‌ఎయిడెడ్ పాఠశాలల లావాదేవీలను పరిశీలించింది. ఫీజుల పెంపు సమంజసమా కాదా అనే విషయాన్ని కూడా పరిశీలించింది. ఇందులో 364 పాఠశాలల యాజమాన్యాలు ఫీజు పెంచడాన్ని అసమంజసమని ఈ ప్యానల్ హైకోర్టుకు  వారం క్రితం ైెహ కోర్టుకు సమర్పించిన తన మధ్యంతర నివేదికలో పేర్కొంది.
 

>
మరిన్ని వార్తలు