అగ్రీగోల్డ్ బాధితులను ప్రభుత్వమే ఆదుకోవాలి

23 Aug, 2016 20:48 IST|Sakshi

- ఆత్మహత్య చేసుకున్న మృతులకు పిండ ప్రధానం
గుణదల

 అగ్రిగోల్డ్‌లో డిపాజిట్లు చేసి మోసపోయి ఆత్మహత్య చేసుకున్న అగ్రిగోల్డ్ బాధిత మృతులకు మంగళవారం ఉదయం పద్మావతి ఘాట్‌లో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో పిండ ప్రధాన కార్యక్రమం జరిగింది. బాధితుల సంఘం ప్రధాన కార్యదర్శి వి. తిరుపతిరావు, ఉప ప్రధాన కార్యదర్శి వి. చంద్రశేఖర్ తదితరులు పిండ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధిత డిపాజిటర్లు మొత్తం 20 లక్షల మంది ఉన్నారని, అందులో 3 లక్షల మంది ఏజట్లు ఉన్నారని వీరంతా ప్రభుత్వ జోక్యం కోసం ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. 100 మందికి పైగా బాధితులు ఆత్మహత్య చేసుకున్నారని, వీరందరికీ తమ సంఘం తరఫున పిండ ప్రధానం చేస్తున్నామని తెలిపారు.

 

అగ్రిగోల్డ్ చేసిన ఆర్థిక కుంభకోణానికి డిపాజిటర్లు బలైపోతున్నారని, ప్రభుత్వం ఆదుకుని డిపాజిటర్లకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. డిపాజిట్ దారులను ఆదుకునేందుకు రూ.100 కోట్లు విడుదల చేయాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ప్రతి నెలరూ. 1000 కోట్ల అస్తుల వేలం వేయటానికి చర్యలు తీసుకోవాలని, అలాగే అగ్రిగోల్డ్ డిపాజిటర్ల జాబితాను ఆన్‌లైన్‌లో పొందుపరచి, కొంత ఏజంట్లకి బాండ్ల రూపంలో నగదును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు షరీఫ్, వెంకటేష్, టి. పెద్ద వెంకటేశ్వర్లు, కే.ఆర్ ఆంజనేయులు, ఆర్. పిచ్చయ్య, పటేల్ శ్రీనివాసరెడ్డి, మూనంపాటి సుబ్బలక్ష్మీ, ఆంజనేయులు, కాంత్రి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు