తుంగభద్రకు పెరిగిన ఇన్‌ఫ్లో

14 Jul, 2015 19:36 IST|Sakshi

బళ్లారి : ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఉమ్మడి జలాశయమైన తుంగభద్ర డ్యాంలోకి ఇన్‌ఫ్లో మరింత పెరిగింది. మంగళవారం డ్యాంలోకి దాదాపు 20 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో ఒకే రోజు దాదాపు రెండు టీఎంసీల మేర నీటి నిల్వ పెరిగింది. ప్రస్తుతం డ్యాంలో 37 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాంకు ఎగువన నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు పెద్దఎత్తున వస్తోంది. దీంతో డ్యాంలో నీటిమట్టం రోజురోజుకూ పెరుగుతోంది. డ్యాంలోకి 40 టీఎంసీల నీరు నిల్వ చేరితే కాలువలకు వదలుతారు. గత ఏడాది ఇదే సమాయనికి డ్యాంలో నీటిమట్టం 1,595.97 అడుగులు, 14.498 టీఎంసీలుగా ఉండేది. ఇన్‌ఫ్లో 939 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 150 క్యూసెక్కులుగా ఉండేది. ప్రస్తుతం నీటిమట్టం 1,610.88 అడుగులు, నీటి నిల్వ 37 టీఎంసీలు. ఇన్‌ఫ్లో 19,912 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1.360 క్యూసెక్కులు.

>
మరిన్ని వార్తలు