కోర్టు తీర్పుపై నేతల అభిప్రాయాలు

15 Feb, 2017 02:01 IST|Sakshi

టీనగర్‌: ఆస్తులు కూడబెట్టిన కేసులో శశికళ దోషిగా సుప్రీంకోర్టు ప్రకటించడంతో రాజకీయ నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

తమిళిసై సౌందరరాజన్‌ (బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు): సుప్రీంకోర్టు తీర్పు అవినీతిపరులకు అగాథం వంటిది. బీజేపీ లక్ష్యం అవినీతిని అంతమొందించడమే. ఈ తీర్పుతో రాష్ట్ర ప్రజలకు మేలు కలిగింది.

తిరుమావళవన్‌ (వీసీకే అధ్యక్షుడు): ఇది చారిత్రాత్మక తీర్పు. అవినీతికి పాల్పడేవారికి భీతి కలిగించే తీర్పు

జి.రామకృష్ణన్‌ (సీపీఎం రాష్ట్ర కార్యదర్శి) : ప్రజా జీవితంలో అవినీతికి పాల్పడే వారికి ఈ తీర్పు ఒక హెచ్చరిక

ఈఆర్‌.ఈశ్వరన్‌ (కొంగునాడు మక్కల్‌ దేశీయకట్చిఅధ్యక్షుడు):సుప్రీంకోర్టు తీర్పు అవినీతికి పాల్పడే నేతలకు సమ్మెటపోటు.

ఇనాయతుల్లా (అఖిల భారత దేశీయ లీగ్‌ అధ్యక్షుడు): సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రజలు రక్షించబడ్డారు.

ఎన్‌ఆర్‌.ధనబాలన్‌ (పెరుందలైవర్‌ మక్కల్‌ కట్చి): దీర్ఘకాలం తర్వాత తీర్పు విడుదలయినప్పటికీ ప్రశంసనీయంగా నిలిచింది.

సేతురామన్‌ (మూవేందర్‌ మున్నని కళగం, అధ్యక్షుడు) : రాష్ట్ర ప్రజల మనోభావాన్ని సుప్రీంకోర్టు నెరవేర్చినట్లయింది.

జవాహిరుల్లా (మనిదనేయ మక్కల్‌ కట్చి అధ్యక్షుడు) : 21 ఏళ్ల తర్వాత అవినీతిని ధ్రువపరుస్తూ నేడు సుప్రీంకోర్డు ఇచ్చిన తీర్పు వాస్తవంగా చారిత్రాత్మకం.

తమిళరువి మణియన్‌ : సుప్రీంకోర్డు అవినీతికి వ్యతిరేకంగా నరకాసుర వధ జరిపింది. ఇదే విధంగా పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు