ఆ మధుర క్షణాలను మరువలేను: రమ్య

11 Apr, 2014 01:31 IST|Sakshi
ఆ మధుర క్షణాలను మరువలేను: రమ్య

గోపాలపురలోని తన తాత ఇంటిని సందర్శించిన రమ్య
 
మండ్య, న్యూస్‌లైన్ : గోపాలపురలోని తాతగారి ఇంటిలో చిన్నప్పుడు గడిపిన క్షణాలను ఎన్నటికీ మరువలేనని, ఇక్కడి ప్రజల ఆప్యాయత తనను ముగ్ధురాలిని చేసిందని మండ్య లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి  రమ్య పేర్కొన్నారు. మండ్యలో గురువారం నిర్వహించిన రోడ్‌షోకు ముందు ఆమె గోపాలపురానికి వెళ్లి తాత జీఎస్ బోరేగౌడ ఇంటిని సందర్శించారు.

బోరేగౌడ ఫొటోకు నమస్కారం చేసి బోరేగౌడ సోదరుడు జీఎస్.వెంకటేష్, వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారు ఇచ్చిన అల్పాహారాన్ని స్వీకరించి చిన్నప్పుడు తాను గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను పుట్టిన తర్వాత ఐదేళ్ల వరకు తరచూ గ్రామానికి వచ్చి వెళ్ళదానినని పేర్కొంది.

తాత ఇచ్చిన చెరుకుగడలను తిని ఆ రుచిని ఆస్వాదించడం ఇప్పటికీ గుర్తుందని పేర్కొంది. ఇక్కడ తిరిగిన అన్ని స్థలాలు  ఇప్పటికి గుర్తుకున్నాయన్నారు.  తనకు ఇంతమంది బంధువులు, శ్రేయోభిలాషులున్నారని తెలియలేదని పేర్కొంది.

వీరు చూపిన ప్రేమ, అప్యాయతను ఎన్నటికీ మరువలేనని పేర్కొంది. అనంతరం ఆమె బయల్దేరుతుండగా తరలివచ్చిన గ్రామస్తులు ఆమెతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తావని ఆశీర్వదించారు. రమ్య వారందరికీ చేతులు జోడించి నమస్కారం చేసి కార్యకర్తలతో కలిసి వెళ్లిపోయారు.  
 

మరిన్ని వార్తలు