సీవీఎంల తొలగింపుతో ఇబ్బందులు

17 May, 2015 23:17 IST|Sakshi
సీవీఎంల తొలగింపుతో ఇబ్బందులు

- సాఫ్ట్‌వేర్ ఏజెన్సీ, సీఆర్‌ఐఎస్ మధ్య సమన్వయ లోపంతోనే..
- ఏటీవీఎంలో టీఈ సౌకర్యం కల్పించాలంటున్న ప్రయాణికులు
సాక్షి, ముంబై:
లోకల్ రైళ్ల టికెట్ జారీ చేసే కూపన్ వాలిడేటింగ్ మిషన్లను తొలగించడంతో నగర ప్రయాణికులు ఇబ్బందులను గురవుతున్నారు. వాటిని తొలగించడంతో లక్షల మంది ప్రయాణికులు టికెట్ కౌంటర్లు, ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషన్లు (ఏటీవీఎం), మొబైల్ టికెటింగ్ వ్యవస్థపై ఆధారపడుతున్నారు. ప్రధానంగా సీజన్ పాస్ హో ల్డర్లు ప్రయాణాన్ని పొడగింపు విషయంలో ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. సెంట్రల్, వెస్టర్న్ రైల్వేలో సాఫ్ట్‌వేర్ ఏజెన్సీ, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ (సీఆర్‌ఐఎస్) మధ్య సమన్వయం లోపించడంతోనే ఈ సమస్య తలెత్తినట్లు సమాచారం. ఏటీవీఎంల ద్వారా జర్నీని పొడగించుకునే వెసులుబాటును కల్పించాలని ఏడాది నుంచి వెస్టర్న్ రైల్వే కోరుతున్నట్లు సంబంధిత అధికారి తెలి పారు. ఏటీవీఎం కార్డులను రీఫిల్ చేసుకునే వెసులుబాటును రైల్వే స్టేషన్‌లోని ప్రతి టికెట్ కౌంటర్‌లో కల్పించాలని అభిప్రాయపడ్డారు.  

ఏటీవీఎంలలో జర్నీ పొడగించుకునే వెసులుబాటు కల్పించాలనే సూచనలు అందుతున్నాయని సెంట్రల్ రైల్వే పేర్కొంది. సీఆర్‌ఐఎస్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, కాని కొన్ని కారణాల వల్ల ఇందులో జాప్యం జరుగుతోందని తెలిపింది. వెస్టర్న్ రైల్వేలో దాదాపు 450, సెంట్రల్ రైల్వేలో 600 ఏటీవీఎంలు ఉన్నా యి. నగరంలో ఉన్న ప్రతి ఏటీవీఎంలలోనూ అధికారులు మొబైల్ టికెటింగ్ వెసులుబాటు కల్పించారు. ఈ విధానాన్ని కేంద్ర రైల్వే మం త్రి సురేశ్ ప్రభు ఇటీవల ప్రారంభించారు. ప్రస్తుతానికి ఈ మిషన్లలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని, కొంత మార్పు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు