ప్రేమ బంగారంగానూ..!

27 Jan, 2018 07:37 IST|Sakshi

ప్రియురాలిగా భావించి వేరొక మహిళను కొట్టి చైన్‌ చోరీ

చెన్నైలో చిత్రమైన చోరుడు

సాక్షి ప్రతినిధి, చెన్నై : వృత్తిరీత్యా అతనో దొంగ.. అయితేనేం తనలోనూ ఓ ప్రేమికుడున్నాడని చూపించాడు. ప్రేమికురాలు వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయినా ఆమె జ్ఞాపకాలను ఫొటో ఫ్రేంలో ‘బంగారం’లా పదిలం చేసుకున్నాడు. అయితే, ఇంతలోనే పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. అతని ప్రేమగాథను విన్న పోలీసులు అవాక్కయ్యారు. చెన్నై సైదాపేట ఉత్తర జోన్స్‌ రోడ్డులోని ఒక అపార్టుమెంటులో సెల్వ గణేష్, గుణసుందరి ఉంటున్నారు. ఈనెల 21న గుణసుందరి ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో ఒక అగంతకుడు ఆమె తలపై కొట్టి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లిపోయాడు. ఆఫీసు నుంచి వచ్చిన భర్త రక్తపుమడుగులో పడి ఉన్న భార్యను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితుడ్ని పాత నేరస్తుడు జాన్సన్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని గొలుసు గురించి విచారించారు. నిందితుడు పోలీసులను తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ చైనును ఒక పెద్ద ఫొటో ఫ్రేంలో పెట్టి గోడకు తగలించి ఉండడాన్ని చూసి బిత్తరపోయారు. ఇలా తగిలించుకున్నావేమిటని పోలీసులు ప్రశ్నిస్తే తన ప్రేమగాథను చెప్పుకొచ్చాడు. ‘నేను గతంలో ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమె కూడా ప్రేమించింది. అయితే, మరొకరిని పెళ్లి చేసుకోవడంతో ఆ బాధను భరించలేక మరో ప్రాంతానికి వెళ్లిపోయా. అయినా, ఆమెను మర్చిపోలేకపోతున్నా. ఈ మధ్యే ఒక ఇంట్లో ఆమెను చూసి కోపంతో కొట్టి బంగారు చైనును తెచ్చేశా. అందుకే దానిని అమ్మకుండా ఆమె గుర్తుగా ఫొటో ఫ్రేంలో పెట్టుకున్నా’నని వివరించాడు. దొంగ ప్రేమకథతో విస్తుపోయిన పోలీసులు ఆమె నీ ప్రేయసి కాదని చెప్పడంతో, చీకట్లో పొరపడ్డానని వివరణ ఇచ్చుకున్నాడు. దీంతో పోలీసులు అతన్ని శుక్రవారం కటకటాల వెనక్కు నెట్టారు.

Read latest Tamil-nadu News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టిక్‌ టాక్‌: మహిళా పోలీసుల స్టెప్పులు.. వైరల్‌

బైకులు ఢీ; బస్సు కిందపడి ఇద్దరమ్మాయిల దుర్మరణం

14 మంది ఉగ్రవాదులకు రిమాండ్‌

ఐదేళ్ల చిన్నారిపై కీచకపర్వం

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

చెన్నైలో భారీ వర్షం

తమిళనాడులో పేలుళ్లకు కుట్ర?

సినిమా పోస్టర్‌ నిజమై నటుడు మృతి!

40 ఏళ్లకోసారి దర్శనం.. పోటెత్తిన భక్తులు

తమిళ హిజ్రాకు కీలక పదవి

యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి

కేక్‌ ఆర్డర్‌ చేస్తున్నారా..? అయితే జాగ్రత్త!

పట్టాలపై 2.5 మిలియన్‌ లీటర్ల నీరు..!

పెళ్లిళ్లను కాటేస్తున్న కుల తేడాలు

ప్రియురాలిని కడతేర్చిన ప్రియుడు

ఆ బాలుడిని పాఠశాలలో చేర్చుకోండి

కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన టిక్‌టాక్‌

నిరాడంబరంగా న్యాయవాది నందిని పెళ్లి

విద్యార్హతలు ఎక్కువగా ఉంటే ఉద్యోగాలకు అనర్హులే!

రోమియో టీచర్‌

నర్సు ఆత్మహత్య

ప్రియుడు వివాహానికి ఒప్పుకోలేదని..

గర్భం చేశాడు.. భయంతో విషం తాగాడు

నేను అమ్మాయిలా ఉన్నాను..అందుకే!

భర్తని హత్య చేసి ఇంటి వెనుక పాతి పెట్టింది..

‘ఆ అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటారు’

‘శరవణ’ పిటిషన్‌ కొట్టివేత

శరవణ భవన్‌ రాజగోపాల్‌కు ఎదురుదెబ్బ

సెల్ఫీ వీడియో: నవవధువు ఆత్మహత్యాయత్నం

విశాల్‌కు చెన్నై హైకోర్టులో చుక్కెదురు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!