రూ.లక్షకు పెరిగిన ఎమ్మెల్యేల వేతనం

11 Jan, 2018 09:38 IST|Sakshi

వేతన పెంపు ముసాయిదా

డీఎంకే వ్యతిరేకత

టీ.నగర్‌: అసెంబ్లీలో వేతనాల పెంపు ముసాయిదాను బుధవారం ప్రవేశపెట్టారు. దీంతో ఎమ్మెల్యేల వేతనం లక్ష రూపాయలకు చేరింది. రాష్ట్ర ఎమ్మెల్యేల వేతనాన్ని పెంచేందుకు సంబం«ధించిన చట్ట ముసాయిదా అసెంబ్లీ పక్షనేత, ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టారు. ఇందుకు ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా మద్దతు ప్రకటించడంతో ముసాయిదాకు అంగీకారం తెలిపినట్లు స్పీకర్‌ ధనసాల్‌ ప్రకటించారు. ఈ ముసాయిదాకు డీఎంకే తరఫున ఆ పార్టీ విప్‌ తీవ్ర వ్యతిరేకత తెలిపారు.

ముసాయిదాలోని వివరాలు.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రిసీడియం చైర్మన్, డిప్యూటీ ప్రెసిడీయం చైర్మన్, ప్రతిపక్ష నేత, ప్రభుత్వ విప్, అసెంబ్లీ సభ్యుల వేతనాలు ఎనిమిది వేల రూపాయల నుంచి రూ.30 వేలకు  పెరిగాయి. ఇదే విధంగా పలు రాయితీలు కల్పించారు. అసెంబ్లీ మాజీ సభ్యుల పింఛన్‌ 12 వేల రూపాయల నుంచి రూ.20 వేలకు పెంచారు. మాజీ సభ్యుల చట్టబద్ధమైన వారసులకు కుటుంబ పింఛన్‌ ఆరువేల రూపాయల నుంచి రూ.10 వేలు అందించనున్నారు. ఇలాఉండగా ఈ వేతనాలు 2017 జూలై ఒకటవ తేదీ నుంచి అమలుచేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ముసాయిదా నెరవేర్చడం ద్వారా ప్రభుత్వానికి అదనంగా ఏటా రూ.25.32కోట్ల ఖర్చు ఏర్పడనుంది. ఈ విధంగా ముసాయిదాలో పేర్కొన్నారు. ఈ ముసాయిదా నెరవేరడంతో ఇకపై ఎమ్మెల్యేలు నెలసరి వేతనంగా లక్ష రూపాయలు అందుకోనున్నారు.

మరిన్ని వార్తలు