11 నెలల చిన్నారికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స | Sakshi
Sakshi News home page

11 నెలల చిన్నారికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స

Published Fri, Nov 17 2023 1:32 AM

వైద్యులతో శిశువు, తల్లిదండ్రులు  - Sakshi

సాక్షి,చైన్నె: ఎంజీఎం హెల్త్‌ కేర్‌లో 11 నెలల శిశువుకు కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. గురువారం ఈ వివరాలను ఎంజీఎం వైద్యులు డాక్టర్‌ త్యాగరాజన్‌ శ్రీనివాసన్‌, డాక్టర్‌ కార్తీక్‌ మదివానన్‌ మీడియాకు వివరించారు. ఒడిశాకు చెందిన ఓ దంపతులకు జన్మించిన 11 నెలల శిశువు కాలేయ కేన్సర్‌తో బాధ పడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ శిశువును శస్త్ర చికిత్స నిమిత్తం చైన్నెకు తీసుకొచ్చారు. ఎంజీఎం ఆస్పత్రిలో కొద్ది రోజుల క్రితం 40 మంది వైద్యులతో కూడిన బృందం 16 గంటల పాటు సంక్లిష్టమైన శస్త్ర చికిత్సను నిర్వహించింది. ఈ శిశువుకు తమిళనాడుకు చెందిన 42 ఏళ్ల దాత నుంచి కాలేయం సేకరించారు. ఈ దాత కాలేయం పెద్దది కావడంతో దాని స్వరూపం తగ్గించేందుకు, సంరక్షించేందుకు ఆధునిక విధానాన్ని అనుసరించి 11 నెలల శిశువుకు కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతం చేశామని వైద్యులు వివరించారు. ఎంజీఎం హెల్త్‌ కేర్‌ సీఈఓ హరీష్‌ మణియన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement