జియో కస‍్టమర్లకు దసరా సంబరాలు

2 Sep, 2017 19:54 IST|Sakshi
జియో కస‍్టమర్లకు దసరా సంబరాలు

ముంబై: సంచలన రిలయన్స్‌ జియో 4 జీ ఫీచర్‌ ఫోన్‌ నవరాత్రికి కస్టమర్లను మురిపించనుంది. జియో వినియోగదారులు  తన మొదటి  ఫీచర్‌ఫోన్‌తో  ఈ ఏడాది  దసరా  సంబరాలను  జరుపుకునేలా ప్లాన్‌ చేసింది. ప్రీ బుకింగ్‌ చేసుకున్న 60 లక్షల మందికి సెప్టెంబర్‌ 21 నుంచి డెలివరీ చేయనున్నట్లు రిలయన్స్‌ జియో పేర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే  మరోగుడ్‌ న్యూస్‌ ఏమిటంటే. త్వరలోనే కొత్త ప్రీ బుకింగ్‌లను కూడా ప్రారంభించనుందని తెలుస్తోంది.

జియో ఫోన్‌ కోసం ఆగస్టు 24 న ముందస్తు బుకింగ్  మొదలుకాగా కేవలం మూడు   గంల్లోనే సుమారు 60 లక్షల యూనిట్ల జయో ఫీచర్ ఫోన్లు బుక్‌ అయ్యాయి. దీంతో బుకింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది.  అయితే   వినియోగదారుల  రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని, బుకింగ్ ప్రక్రియ పునఃప్రారంభించనుందని, ఈ సమాచారాన్ని కస్టమర్లకు అందించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.  అలాగే ప్రాధాన్యత ఆధారంగా  వీటిని అందించనుంది.

కాగా   జూలై 21, 2017 న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ రిలయన్స్ జియో ఫీచర్‌ ఫోన్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వన్‌ప్లస్‌ 6టీ మెక్‌లారెన్‌ ఎడిషన్‌ సేల్‌

ఆపిల్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్‌

నాలుగేళ్లలో... స్మార్ట్‌ఫోన్ల రెట్టింపు!

ఆసుస్‌ నుంచి రెండు కొత్త ఫోన్లు

48 ఎంపీ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిల్డర్‌తో వివాదం.. ప్రధాని సాయం కోరిన నటి

అక్షయ్‌ ఖన్నా తల్లి గీతాంజలి మృతి

మొత్తం మన చేతుల్లోనే!

రౌడీ బేబీ అంటున్న ధనుశ్‌

మహా వివాదంపై వివరణ

సరికొత్తగా...