భారత్‌లో లగ్జరీ బ్రాండ్‌ బాలెన్సియాగా స్టోర్‌ ప్రారంభం

6 Nov, 2023 17:51 IST|Sakshi

రిలయన్స్ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్‌ ఇషా అంబానీ భారత్‌లో ఫ్రెంచ్ కార్పొరేషన్ కెరింగ్ యాజమాన్యంలోని లగ్జరీ బ్రాండ్‌ బాలెన్సియాగా తొలి స్టోర్‌ను ప్రారంభించారు. రిలయన్స్‌ బ్రాండ్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌బీఎల్‌).. ఫ్రెంచ్ కార్పొరేషన్ కెరింగ్ సంస్థతో చేతులు కలిపింది. ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం తర్వాత జియో వరల్డ్‌ ప్లాజాలో స్టోర్‌ను అందుబాటులోకి తెచ్చారు. 

ఇటీవల, రిలయన్స్ ఇండస్ట్రీస్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో జియో వరల్డ్ ప్లాజాను ప్రారంభించింది. ఈ మాల్‌ లో డియోర్, గూచీ, లూయిస్ విట్టన్, రోలెక్స్ తో పాటు దాదాపూ 20కి పైగా హై-ఎండ్ బ్రాండ్‌ల విక్రయాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ జియో వరల్డ్‌ ప్లాజాలోనే బాలెన్సియాగా బ్రాండ్స్‌ అమ్మకాలు సైతం ప్రారంభించినట్లు రిలయన్స్‌ రీటైల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 

ప్రీమియం బ్రాండ్స్‌  
ఆర్‌బీఎల్‌ ప్రీమియం ఫ్యాషన్, లైఫ్ స్టైల్ విభాగాలలో గ్లోబల్ బ్రాండ్‌లను లాంచ్ చేసేందుకు సుమఖత వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే అర్మానీ ఎక్స్ఛేంజ్, బర్బెర్రీ, క్లార్క్స్, కోచ్, డీజిల్, డూన్, ఈఎస్‌7, ఎంపోరియో అర్మానీ, గ్యాస్, జార్జియో అర్మానీ, హామ్లీస్, హ్యూగో బాస్, హంకెమోలర్, జిమ్మీ చూ, కేట్ స్పేడ్ న్యూయార్క్, మనీష్ మల్హోత్రాలతో ఒప్పందం కుదుర్చుకుని వ్యాపార కార్యకలాపాల్ని ముమ్మరం చేసింది.  
 

మరిన్ని వార్తలు