గెలాక్సీ​ ఎస్‌ 8ప్లస్‌ ఇండియాలో..ధర ఎంత?

2 Jun, 2017 13:00 IST|Sakshi
గెలాక్సీ​ ఎస్‌ 8ప్లస్‌ ఇండియాలో..ధర ఎంత?

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 8 ప్లస్‌ను ఇండియ న్‌ మార్కెట్‌ లో శుక్రవారం లాంచ్‌ చేసింది.  గ్లోబల్‌గా గెలాక్సీ ఎస్‌8 ,ఎస్‌8ప్లస్‌లకు మంచి స్పందన లభించిన  తర్వాత 6జీబీ వేరియంట్‌  గెలాక్సీ ఎస్‌ 8ప్లస్‌ కొత్త వెర్షన్‌ను భారత్‌ లో లాంచ్‌  చేసింది. దీని ధరను రూ. 74,990గా నిర్ణయించింది.   ఈ రోజునుంచి (జూన్‌ 2) ఫ్లిప్‌కార్ట్‌లో  ఈ స్మార్ట్‌ఫోన్‌కు  ప్రీ బుక్‌ చేసుకోవచ్చనీ, జూన్‌ 9 నుంచి డెలివరీ మొదలవుతుందని కంపెనీ తెలిపింది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌తో అందుబాటులోకి తీసుకొచ్చిన  స్మార్ట్‌ఫోన్‌ మల్టీ టాస్కింగ్‌ కస్టమర్లకు ఇది అల్టిమేట్‌ డివైస్‌ అని శాంసంగ్‌ ఇండియా మొబైల్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆసిమ్ వార్సీ ఒక ప్రకటనలో తెలిపారు. పరిచయ ఆఫర్‌గా  వినియోగదారులు ఉచిత వైర్లెస్ ఛార్జర్‌ను అందిస్తోంది. 

 గెలాక్సీ ఎస్‌ 8ప్లస్‌
6.2ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
2960×1440 రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 7.0 నౌగాట్‌
6 జీబీర్యామ్‌
128 ఇంటర్నల్‌  స్టోరేజ్‌
12ఎంపీ రియర్‌ కెమెరా,  
8 ఎంపీ సెల్పీ కెమెరా విత్‌  మల్టీ-ఫ్రేమ్ ప్రాసెసింగ్ , ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌
3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ  సామర్ధ్యం

Read latest Technology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు