కృష్ణమ్మ పరవళ్లకు 51ఏళ్లు

4 Aug, 2018 15:33 IST|Sakshi
నీటి విడుదల అనంతరం ఎడమ కాల్వలో ప్రవహిస్తున్న నీటిని పరిశీలిస్తున్న నాటి ప్రధాని ఇందిరాగాంధీ(ఫైల్‌) 

నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేసింది ఈ రోజునే

రెండు కాల్వల పరిధిలో సుమారు 25 లక్షల ఎకరాలకు సాగునీరు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలు సస్యశ్యామలం  

నాగార్జునసాగర్‌ : తెలుగు రాష్ట్రాల వరప్రదాయిని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల చేసి నేటికీ 51ఏళ్లు నిండాయి. కృష్ణానదిపై నిర్మించిన బహుళార్థక సాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్‌ మానవ నిర్మిత ఆనకట్టల్లో ప్రపంచంలోనే అతిపెద్దది. 1967ఆగస్టు 4న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేసి, ప్రాజెక్టును జాతికి అంకితం చేసింది. 1955 డిసెంబర్‌ 10న ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ శంకుస్థాపన చేయగా 12 ఏళ్ల తర్వాత ఆయన కుమార్తె ఇందిరాగాంధీ సాగర్‌ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు.

ఆనాడు రైతుల కళ్లల్లో ఆనందం తొ ణికిస లాడింది. కాల్వల్లో నీరు పారడంతో బీళ్లుగా ఉన్న భూముల్లో రైతులు సిరులు పండిస్తున్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సుమారు 3లక్షలు, కుడి, ఎడమ ఎడమ కాల్వల ద్వారా రూ. 25 లక్షల ఎకరాల భూమి సాగవుతోంది. తాగు, సా గునీటికి కొదువలేకుండా పోయింది. ఆయకట్టు పరిధిలోని మిర్యాలగూడ, కోదాడ, హాలియా, నేరేడుచర్ల, హూజూర్‌నగర్‌ ప్రాంతాలు నేడు ఆరి ్థకంగా అభివృద్ధి పథంలో ఉన్నాయి.

నేటికీ నెరవేరని లక్ష్యం

ఇన్నేళ్లు గడిచినా ప్రాజెక్టు లక్ష్యం నెరవేరలేదు. ప్రాజెక్టు ఆధునికీకరణలో కొన్ని ప్రాంతాలకు నీరు చేరువైనప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లోని కాల్వ చివరి భూములకు నేటికీ నీరందడం లేదు. ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో ఉన్న భూములు బీడు భూములుగానే ఉంటున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి అంచనా వ్యయం కేవలం రూ.70కోట్లు కాగా ఆ తర్వాత మరమ్మతులకే వేల కోట్ల రూపాయలు వ్యయం చేశారు.

ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందకపోవడంతో నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. ప్రపంచబ్యాంకు ఆర్థికసాయంతో రూ.4,444.44కోట్లతో ప్రణాళిక తయారుచేసి పనులను ప్రారంభిం చారు. 2016లో పనులు పూర్తి చేశారు. ఆధునికీకరణతో పూర్తిస్థాయిలో నీరుసాగర్‌ ప్రాజెక్టు ఆధునికీకరణతో గ్యాప్‌ ఆయకట్టు లక్ష ఎకరాలకు సాగు నీరందడంతో పాటు మరికొంత భూమి టేలాండ్‌గా మారకుండా ఉంది. కాల్వల్లో నీటి ప్రవాహం పెరిగి అనుకున్న సమయానికి పొలాల్లోకి నీరు చేరుతోంది. ఆఫ్‌ ఆన్‌ పద్ధతిలో నీరిచ్చి రైతులకు అదనపు దిగుబడి వచ్చేలా చేశాం.  

- సునీల్, ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌

మరిన్ని వార్తలు