1.6 కోట్ల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి

9 Mar, 2020 02:12 IST|Sakshi

2020 సామాజిక ఆర్థిక సర్వే

2018–19 ఖరీఫ్, రబీ సీజన్‌లో వచ్చిన దిగుబడులు 

6.6 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆహార పంటలు ఆశించిన మేర ఉత్పత్తి అవుతున్నాయి. 2018–19 ఖరీఫ్, రబీ సీజన్లలో 1.6 కోట్ల టన్నుల ఆహార పంటల ఉత్పత్తి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సామాజిక ఆర్థిక సర్వే–2020 నివేదిక వెల్లడించింది. ఇక 2019–20 రెండో ముందస్తు అంచనాలతో అమాంతం పెరిగింది. ఇందులో ఒక వరినే 98.74 లక్షల మెట్రిక్‌ టన్నులుగా ఉంది. దీనిప్రకారం 2018 ఖరీఫ్, రబీ సీజన్లలో వరి 66.69 లక్షల టన్నుల్లో ఉత్పత్తి వచ్చింది. అలాగే మొక్కజొన్న 20.83 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చింది. రాష్ట్రంలో ఆహారేతర పంటల సాగు పెరిగింది. 2016–17కు వచ్చే సరికి 33.6 శాతం ఉండగా 2017–18లో 38.7 శాతానికి పెరిగింది. 2018–19లో 38.8 శాతానికి చేరింది. ఇక పంట రుణాలు 2016–17 సంవత్సరంలో రూ. 26,282 కోట్లు ఇచ్చారు. 2018–19లో రూ.31,410 కోట్లు పంపిణీ చేశారు. 2018–19లో రూ.42,494 కోట్లకు రూ.33,751 కోట్లు బ్యాంకులు ఇచ్చాయి. 

6.6 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం.. 
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి 2019–20 ఫిబ్రవరి వరకు 6.6 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఈ పథకం అమలవుతోంది. ఈ ఆరేళ్ల కాలంలో 2.48 లక్షల మంది రైతులు డ్రిప్‌ సౌకర్యం పొందినట్లు ఈ నివేదిక పేర్కొంది. డ్రిప్‌ ద్వారా నీటితో పాటు అనేక విషయాల్లో రైతులకు ఆదాయం మిగిలిందని, నాబ్కాన్స్‌ సర్వే కూడా వెల్లడించింది. సూక్ష్మసేద్యం అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం నాబార్డు నుంచి రుణం తీసుకుంది. ఉద్యాన శాఖ ద్వారా ఈ పథకాన్ని అమలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ ఇచ్చారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 4.65 లక్షల ఎకరాల్లో డ్రిప్‌ ఇవ్వగా, 1.89 లక్షల ఎకరాల్లో స్ప్రింక్లర్లు ఇచ్చారు. 2016–17, 2017–18 సంవత్సరాల్లో ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఈ 2 సంవత్సరాల్లో వరుసగా 55,121, 83,458 మంది రైతులకు సూక్ష్మసేద్యం అందింది. ఇక 2018–19లో 37,596 మంది రైతులకు, 2019–20లో ఇప్పటివరకు 1,745 మంది రైతులకు డ్రిప్‌ అందింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 56 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇందులో 2.48 లక్షల మందికి మాత్రమే సూక్ష్మసేద్యం అందింది. మరింత మంది రైతులకు లబ్ధి చేకూర్చేందుకు దీంతో ఈసారి బడ్జెట్‌ అంచనాల్లో రూ.600 కోట్లు ప్రతిపాదించింది. 

లక్ష్మీ పంప్‌హౌస్‌ నుంచి 51.77 టీఎంసీల ఎత్తిపోత 
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న లక్ష్మీ (మేడిగడ్డ) పంప్‌హౌస్‌ నుంచి మార్చి 4వ తేదీ నాటికి మొత్తంగా 51.77 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసినట్లు సామాజిక, ఆర్థిక సర్వేలో వెల్లడైంది. అలాగే ఎగువన ఉన్న సరస్వతి (అన్నారం) పంప్‌హౌస్‌ ద్వారా 46.53 టీఎంసీలు, దాని పైన ఉన్న పార్వతి (సుందిళ్ల) ద్వారా 44.06 టీఎంసీల నీటిని ఎల్లంపల్లి రిజర్యాయర్‌లోకి ఎత్తిపోసినట్లు సర్వే తెలిపింది. ఇక ఎల్లంపల్లి నుంచి నంది పంప్‌హౌస్‌ ద్వారా 59.94 టీఎంసీలు, గాయత్రి పంప్‌హౌస్‌ ద్వారా 57.64 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు వెల్లడించింది. ఇక మిషన్‌ కాకతీయ ద్వారా ఇప్పటి వరకు నాలుగు విడతలుగా 27,584 చెరువుల పునరుద్ధరణను రూ.8,735.32 కోట్లతో చేపట్టినట్లు సర్వే వెల్లడించింది. ఇందులో ఇప్పటివరకు 21,601 చెరువుల పనులు పూర్తయ్యాయని, దీనికి రూ.4,352 కోట్లు ఖర్చు చేశారని పేర్కొంది. ఈ చెరువుల పునరుద్ధరణ ద్వారా 8.94 టీఎంసీల నీటి నిల్వలు పెరిగాయని వెల్లడైంది. మరో 5,983 చెరువుల పనులు పూర్తి చేయాల్సి ఉందని తెలిపింది.   

టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 13.08 లక్షల మందికి ఉపాధి 
తెలంగాణ పారిశ్రామిక విధానం ‘టీఎస్‌ఐపాస్‌’ద్వారా గతేడాది డిసెంబర్‌ 31 నాటికి రాష్ట్రంలో 6,23,071 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. రూ.1,84,655 కోట్ల పెట్టుబడితో 11,857 కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయి. ఇందులో 9,020 పరిశ్రమల్లో ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభమైంది. టీఎస్‌ఐపాస్‌ కింద రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల పురోగతి 

మరిన్ని వార్తలు