తెలంగాణ యువతుల సాహస యాత్ర

9 Apr, 2018 03:38 IST|Sakshi
యాత్ర పూర్తి చేసుకుని నగరానికి చేరుకున్న యువతులు

విజయవంతంగా ‘రోడ్‌ టు మెకాంగ్‌ ఎక్స్‌పెడిషన్‌’   

హైదరాబాద్‌: ఎర్రటి ఎండలు, చలిగాలులు, నిర్జన ప్రదేశాలు, సంక్లిష్టమైన వాతావరణ పరిస్థితుల మధ్య తెలంగాణ యువతులు ‘రోడ్‌ టు మెకాంగ్‌ ఎక్స్‌పెడిషన్‌’ను విజయవంతంగా పూర్తిచేశారు. రెండు నెలల కాలంలో ఆరు దేశాల్లో 17 వేల కిలో మీటర్ల దూరాన్ని మోటార్‌ బైక్‌పై చుట్టేసి వచ్చారు. ఆదివారం నగరానికి చేరుకున్న ఆ సాహస యువ తులు జయభారతి, ప్రియా బహదూర్, శిల్పా బాలకృష్టన్, ఏఎస్‌డీ శాంతిలకు పర్యాటకశాఖ అధికారులు, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇక్కడి పర్యాటక భవన్‌లో వారిని టూరిజం కార్పొరేషన్‌ ఎండీ మనోహర్, ఇండియా టూరిజం అధికారి శంకర్‌రెడ్డి సత్కరించారు.  

ఆరు దేశాల్లో సాగిన యాత్ర 
టీమ్‌ లీడర్‌ జయభారతి మాట్లాడుతూ, మన దేశంలోని 15 రాష్ట్రాల గుండా సాగిన తమ మోటార్‌ బైక్‌ ప్రయాణం మయ న్మార్, థాయ్‌లాండ్, లావోస్, వియత్నాం, కాంబోడియా, బంగ్లాదేశ్‌ల మీదుగా తిరిగి భారత్‌ చేరుకున్నట్లు చెప్పారు. ప్రతి ప్రాంతంలోనూ భాష, సంస్కృతితో సంబంధం లేకుండా తమను ఆదరంగా అక్కున చేర్చుకున్నారన్నారు. రాష్ట్ర సంస్కృతి, భారతదేశ పర్యాటకం గురించి అందరూ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారన్నారు. శాంతి మాట్లాడుతూ, అన్ని చోట్లా తమ శక్తి మేరకు ఇండియా టూరిజం, తెలంగాణ టూరిజంను ప్రచారం చేశామన్నారు. కార్యక్రమంలో సభ్యు లు శిల్ప, ప్రియ తమ అనుభవాలను పంచుకున్నారు.

మరిన్ని వార్తలు