ప్రభుత్వ కాలేజీల టాపర్లకు సన్మానం

14 Jul, 2018 00:57 IST|Sakshi
అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులతో ఇంటర్మీడియెట్‌ విద్యా కమిషనర్‌ అశోక్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు ప్రతిభకు ప్రతిబింబాలని ఇంటర్మీడియెట్‌ విద్యా కమిషనర్‌ అశోక్‌ పేర్కొన్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీల కంటే ప్రభుత్వ కాలేజీల్లో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో  ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదువుకొని అత్యధిక మార్కులతో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను ఆయన బంగారు పతకాలు, నగదు బహుమతులతో సత్కరించారు. 

టాపర్లకు సత్కారం..
రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ కాలేజీల నుంచి 985 మార్కులతో టాపర్‌గా నిలిచిన సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ విద్యార్థిని జూలూరి శ్రీమేధకు రూ.50 వేల నగదు, బంగారు పతకం, ప్రశంసాపత్రం అందజేశారు. అలాగే 982 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో ఉన్న సిద్దిపేట జిల్లా కోహెడ కాలేజీకి చెందిన కుంభం రమ్యకు రూ.40 వేల నగదుతోపాటు ప్రశంసాపత్రం, 978 మార్కులతో మూడో స్థానం పొందిన ఆదిలాబాద్‌ జిల్లా బో«ధ్‌కు చెందిన కె.హారికకు రూ.30 వేల నగదు, ప్రశంసా పత్రం అందజేశారు. అలాగే గ్రూపుల వారీగా, జనరల్, వొకేషనల్‌లో టాపర్లను సన్మానించారు.

>
మరిన్ని వార్తలు