హైదరాబాద్‌లో డిఫెన్స్‌ ఇంక్యుబేటర్‌!

14 Jul, 2018 00:53 IST|Sakshi

కేటీఆర్‌ లేఖకు నిర్మలాసీతారామన్‌ సానుకూల స్పందన 

టీ హబ్‌లో డిఫెన్స్‌ ఇంక్యుబేటర్‌ ఏర్పాటు చేస్తామన్న కేంద్ర మంత్రి 

సాక్షి, హైదరాబాద్‌: డిఫెన్స్‌ ఇంక్యుబేటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుకు కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చిందని ఐటీ మంత్రి కేటీ రామారావు తెలిపారు. నగరంలో ఉన్న రక్షణ ఎకో సిస్టమ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ డిఫెన్స్‌ ఇంక్యుబేటర్‌ ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ గతంలో రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్‌కు లేఖ రాశారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందించారు. నగరంలోని టీహబ్‌ కేంద్రంగా డిఫెన్స్‌ ఇంక్యుబేటర్‌ ఏర్పాటు చేసేందుకు సానుకూలత తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఇన్నోవేషన్స్‌ ఫర్‌ డిఫెన్స్‌ ఎక్సలెన్స్‌ (ఐడెక్స్‌) పథకంలో భాగంగా డిఫెన్స్‌ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేసేందుకు సానుకూలంగా ఉన్నామని కేంద్ర మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. ఇన్నోవేషన్స్‌ ఫర్‌ డిఫెన్స్‌ ఎక్సలెన్స్‌ పథకంలో రక్షణ, ఏరోస్పేస్‌ రంగంలోని పరిశోధనలను ప్రోత్సహించేందుకు, ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్స్, ఆయా రంగాల్లో వ్యక్తిగత పరిశోధన చేసే వారికి, పరిశోధన సంస్థలకు, విద్యార్థులకు కేం ద్రం ప్రత్యేకంగా నిధులు సమకూర్చే అవకాశం ఉంటుందని నిర్మలాసీతారామన్‌ తెలిపారు.

టీహబ్‌ కేంద్రంగా డిఫెన్స్‌ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రమంత్రి సానుకూల స్పం దనపై కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రక్షణ, ఏరోస్పేస్‌ రంగాలను ప్రాధాన్యత అంశాలుగా గుర్తించిందని, ఈ రంగంలో హైదరాబాద్‌కు కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం విజయవంతమయ్యిందన్నారు. నగరంలో డిఫెన్స్‌ ఇంక్యు బేటర్‌ను ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఉన్న ఎకో సిస్టం మరిం త బలోపేతమవుతుందని అన్నారు. దీని ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తా మని కేటీఆర్‌ తెలిపారు. టీహబ్‌ రెండో దశ భవనంలో డిఫెన్స్‌ ఇంక్యుబేటర్‌కు స్థలాన్ని కేటాయించనున్నట్లు వివరించారు. దీంతో రక్షణ రంగంలో పరిశోధనలకు ప్రోటోటైపింగ్, నైపుణ్య శిక్షణ సేవలను అందించేందుకు దోహదపడుతుందని మంత్రి తెలిపారు. 

మరిన్ని వార్తలు