అప్పుపుట్టక ఆగిన ఆటో డ్రైవర్ గుండె

18 Oct, 2014 23:30 IST|Sakshi
ఆటో డ్రైవర్

పాపన్నపేట : పేదరికమే ఆ యువకుడికి శాపమైంది. ఆటో ఫైనాన్స్ వాయిదా కట్టాల్సిన సమయం దగ్గరపడడంతో నాలు గు రోజులుగా కానవచ్చిన కడపనల్లా తొక్కుతూ.. అవకాశం ఉన్న ప్రతిచోటా అప్పు కోసం యత్నించాడు. కానీ ఎ క్కడా చిల్లిగవ్వ కూడా పుట్టలేదు. దీంతో జీవనాధారమైన ఆటో లాక్కుపోతే బతి కేదెట్లా అంటూ తీవ్ర ఆందోళనకు లోనయ్యాడు. శుక్రవారం రాత్రి తీవ్ర గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని నాగ్సాన్‌పల్లికి చెందిన మ్యాదరి మల్లేశం (24) నిరుపేద కుటుంబంలో జన్మించా డు. చిన్నప్పుడే తల్లి ఈశ్వరమ్మ చనిపో గా మాటలు రాని అక్క శోభ, తండ్రి కిష్టయ్యల పోషణభారం మల్లేశంపైనే పడింది.

గుంట భూమిలేని మల్లేశం అప్పులు చేసి ఆటో కొనుగోలు చేసి బతుకు బండి లాగుతున్నాడు. అయితే ఆటో కంతు కట్టుకుంటే ఎక్కడ లాక్కెళ్తారేమోనన్న ఆందోళన గరవుతుండగా గుండెపోటుకు గురై శుక్రవారం రాత్రి మృతి చెందాడు. అసలే పుట్టెడు దుఃఖం లో కొట్టుమిట్టాడుతున్న ఆ కుటుంబానికి చేతిలో చిల్లిగవ్వలేక ఆందోళనకు లోనైంది. దీంతో మేమున్నామంటూ గ్రామంలోని కుల, యువజన సంఘా లు, ప్రజాప్రతినిధులు ఏకమై చం దా లు వేసి మల్లేశం అంత్యక్రియలు నిర్వహించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. మృతుడికి భార్య మంగ మ్మ, కుమార్తెలు శ్రీజ, శ్రీవనితలు ఉన్నారు. ప్రస్తుతం మంగమ్మ నిండు చూలాలు.
 
గ్రామస్తుల అండ
ఊరందరికీ తలలో నాలుక లా బతికిన మల్లేశం మృతి గ్రామస్తులందరినీ కదిలించింది. ఇద్దరు ఆడపిల్లలు తండ్రి కోసం తల్లడిల్లిపోతుంటే, భర్తను కోల్పో యి నిండు చూలాలిగా మిగిలి గుండె పగిలేలా రోదిస్తున్న మంగమ్మ  చూసి ఊరువాడ ఏకమైంది. తలో చేయి వేసి రూ.70 వేలు పోగుచేసి మల్లేశం కుటుం బానికి అందజేశారు. వీటితోనే శనివా రం అంత్యక్రియలు నిర్వహించారు. ప్ర భుత్వం మల్లేశం కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ ఇందిర  విజ్ఞప్తి చేశా రు. కాగా మల్లేశం మృతి పట్ల  ఆటో డ్రై వర్లు సంతాపం తెలుపుతూ శనివారం  వాహనాలు నడపడం బంద్ చేశారు.

మరిన్ని వార్తలు