దళిత పారిశ్రామికవేత్తలకు అవార్డులు 

15 Apr, 2018 02:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని శనివారం రవీంద్రభారతిలో జరిగిన దళిత పారిశ్రామికవేత్తల అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు ఆయన అవార్డులు అందించారు. దళిత్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (డిక్కీ) పలు డిమాండ్లను మంత్రి ముందుంచింది. గతేడాది ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహంలో భాగంగా రూ.100 కోట్లు ఖర్చు చేశామని, ఈ ఏడాది ఆ మొత్తాన్ని రూ.200 కోట్లకు పెంచామని మంత్రి చెప్పారు. డిక్కి ప్రతిపాదనలపై 15 రోజుల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. 

అవార్డులు అందుకున్న వారు.. 
తయారీరంగం: దాసరి అరుణ, మోక్ష మేరీ, కె.గోవిందరావు, ఎల్‌.ప్రకాశ్‌ 
సేవారంగం: కేవీ స్నేహలత, మంచాల శ్రీకాంత్, పంద సొలొమాన్‌ వివేక్, ఎన్‌.వినోద్‌గాంధీ 
మహిళా పారిశ్రామికవేత్తలు: సుశీల, భుక్యా సరోజిని

మరిన్ని వార్తలు