బీజేపీ శంఖారావం సభ సక్సెస్‌

16 Sep, 2018 11:02 IST|Sakshi
హన్వాడ నుంచి సభకు వెళ్తున్న బీజేపీ నాయకులు

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : బీజేపీ శంఖారావం సభ సక్సెస్‌ ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ‘మార్పు కోసం – బీజేపీ శంఖారావం’ పేరిట శనివారం నిర్వహించిన సభతో జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్‌ కళాశాల మైదానం కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా కాషాయ జెం డాలు రెపరెపలాడాయి. అనుకున్నదాని కంటే రెట్టింపు స్థాయిలో జనం సభకు తరలిరావడం పార్టీలో కొత్త జోష్‌ను నింపింది. సభలో ఎన్నికల హామీలు, అమిత్‌షా ప్రసంగం శ్రేణుల్లో ఉత్తేజం కలిగించింది.

సభకు అమిత్‌షా హాజరవుతున్నారన్న ప్రచారంతో ఉమ్మడి మ హబూబ్‌నగర్‌ జిల్లాతో పాటు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల నుండి నాయకు లు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివ  చ్చారు. అమిత్‌ షా రాక కాస్తా ఆలస్యమైనప్పటికీ కార్యకర్తలు ఎండలోనే వేచి చూశారు. సభా ప్రాంగణానికి అమిత్‌షా చేరుకోగానే వారు కేరింతలు, నినాదాల తో హోరెత్తించారు. సభలో కళాకారుల ఆటపాటలు కార్యకర్తలను ఉత్తేజపరిచా యి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నా యకులు చేసిన విమర్శలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి. సభలో రాష్ట్ర బి జెపి ప్రధాన కార్యదర్శి టి.ఆచారి చేసిన ప్రసంగంతో కార్యకర్తలు కేరింతలు పె ట్టారు. అమిత్‌షా ప్రసంగంతో ముగిసిన అనంతరం రాష్ట్ర కోషాధికారి శాంతికుమార్‌ ధన్యవాదాలు తెలిపారు.
  
ప్రత్యేక ఆకర్షణగా రాజాసింగ్‌ 
సభలో తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసిం గ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ మాట్లాడిన అనంతరం రాజాసింగ్‌కు అ వకాశమివ్వాలని కార్యకర్తలు పెద్దఎత్తు న నినాదాలు చేశారు. అమిత్‌షా ప్రసం గం ముగిశాక వేదిక నుండి నాయకులు కిందికి వెళ్లిపోగా కార్యకర్తలు వేదికపైకి ఎక్కి రాజాసింగ్‌ను పైకి ఆహ్వానించి సన్మానించారు. ఇక సభ నేపథ్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. డీజే మ్యూజిక్‌లతో నృత్యాలు చేశారు. వాహనాలతో రోడ్లన్నీ క్కిక్కిరిసిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కాగా, సభ నేపథ్యంలో జిల్లా కేంద్రం మొత్తం బ్యానర్లతో నిండిపోయింది.
 
పోలీసుల పనితీరు భేష్‌ 
మహబూబ్‌నగర్‌ క్రైం : జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాలలో జరిగిన బీజేపీ సభ సందర్భంగా పోలీసుల పనితీరును ఎస్పీ రెమా రాజేశ్వరి ఓ ప్రకటనలో అభినందించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రణాళిక ప్రకారం సమన్వయంతో బందోబస్తు చేపట్టారని తెలిపారు.

మరిన్ని వార్తలు