కేసీఆర్..అప్పుడేం చేశారు?

12 Aug, 2014 04:01 IST|Sakshi

గద్వాలటౌన్ : పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందినప్పుడు కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్ శ్రేణులు ఏం చేశారని.. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రేమేందర్‌రెడ్డి  ప్రశ్నించారు. పునర్విభజన బిల్లును చట్టం చేసింది బీజేపీ ప్రభుత్వం కాదని.. యూపీఏ ప్రభుత్వమని గుర్తించుకోవాలని ఆయన హితవుపలికారు. సోమవారం ప్రేమేందర్‌రెడ్డి ఆయన గద్వాలలో విలేకరుల తో మాట్లాడారు. ఇప్పటికీ తెలంగాణ బీజేపీ ఆంక్షలు లేని హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటుందని స్పష్టం చేశారు.

ఏవైనా సమస్యలు తలెత్తితే కేంద్రంతో చర్చించి పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. 1956 స్థానికత విషయంలో తెలంగాణ విద్యార్థులకే ఎక్కువగా అన్యాయం జరుగుతుందన్నారు. పాలమూరు జిల్లాను కరువు జిల్లాగా వెంటనే ప్రకటించి ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈనెల 22న హైదరాబాద్‌లో జరిగే సదస్సుకు పార్టీ గ్రామాధ్యక్షులు కావాలని కోరారు. సమావేశంలో రాములు, లక్ష్మి కేశవరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, జగన్నాథం, రాధాకృష్ణారెడ్డి, జీఎం రవి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు