27న బీఎల్‌ఎఫ్‌ మహాధర్నా

26 Jun, 2018 11:45 IST|Sakshi
మాట్లాడుతున్న నున్నా నాగేశ్వరరావు 

సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు  

ఖమ్మంమయూరిసెంటర్‌ : జిల్లాలోనిప్రజలు, రైతులు, ఇతర రంగాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 27న బీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం స్థానిక సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 27న ఉద యం 10 గంటలకు పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నాచౌక్‌లో మహాధర్నా ఉంటుందన్నారు.

ఈ నెల 3 నుంచి గ్రామా ల్లో బీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో 21 మండ లాల్లో 75 బృందాలు 560 గ్రామాల్లో సర్వే నిర్వహించామన్నారు. ఈ సర్వేలో ప్రతి మండలంలో 20 శాతం మంది ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేనివారు ఉన్నారని, అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు అంది స్తామని చెప్పిందని, కానీ ఎక్కడా అవి అర్హులకు అందడం లేదని ఆరోపించారు.

జిల్లాలో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉందని, ప్రతి సీజన్‌లో అటవీశాఖ అధికారులు పంట లు ధ్వంసం చేస్తూ గిరిజనులు, ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, వారికి రైతు బంధు పథకం అమలు చేయాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.5లక్షల బీమా, పోడు భూమికి హక్కుపత్రాలు ఇవ్వాలని కోరారు.

కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో ఖమ్మంలోని గోళ్లపాడు చానెల్‌పై నివసిస్తున్న మూడువేల మంది లబ్ధిదారులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కేటాయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి హామీని అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు.

ఈ ధర్నాకు బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ నల్లా సూర్యప్రకాశ్, రాష్ట్ర నాయకులు బత్తుల హైమావతి హాజరవుతారన్నారు.  సీపీఎం రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు