జైట్లీ ట్వీట్‌:  కేటీఆర్‌ రియాక్షన్‌

17 Apr, 2018 14:06 IST|Sakshi
తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్రి కె.టి రామారావు (ఫైల్‌ ఫోటో)

సాక్షి,  హైదరాబాద్‌: నగదు కొరత సమస్యపై  కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ  వివరణఫై తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్రి కె.టి రామారావు స్పందించారు. ముఖ్యంగా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో తీవ్రంగా నెలకొన్న కరెన్సీ  కష్టాలపై  జైట్లీ వివరణకు  ఆయన కౌంటర్‌ ఇచ్చారు. బ్యాంకులు, ఏటీఎంలలో నగదు కొరత ఆకస్మికంగానో లేదా తాత్కాలికంగానో రాలేదంటూ ట్వీట్‌ చేశారు.  గత మూడు నెలలుగా  హైదరాబాద్లో పదే పదే ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని ట్వీట్‌ చేశారు.  అంతేకాదు బ్యాంకింగ్ వ్యవస్థపై  ప్రజల నమ్మకాన్ని క్రమంగా వమ్ము చేస్తున్న సమస్యపై ఆర్‌బీఐ, ఆర్థికమంత్రిత్వ శాఖ లోతుగా పరిశీలించాలని కోరారు.    

కాగా ఏటీఎంలలో నగదు కొరతపై  ప్రజల ఆగ్రహం నేపథ్యంలో స్పందించిన  అరుణ్‌ జైట్లీ అన్ని బ్యాంకుల్లోనూ   సరిపడా నగదు అందుబాటులో ఉందంటూ  ట్విటర్‌లో   పేర్కొన్నారు. సర్క్యులేషన్లో తగినంత కరెన్సీ   ఉందంటూ వివరణ ఇచ్చారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో  ఆకస్మిక, అసాధారణ లావాదేవీల కారణంగా ఏర్పడిన తాత్కాలిక కొరతను  త్వరగా పరిష్కరిస్తానని ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు